Corona virus: ఆ ఏరియాలో కరోనా విలయం.. మార్చురీలకు పోటెత్తుతున్న మృతదేహాలు శవపేటికల కొరత..
మార్చురీలకు శవాలు భారీగా వస్తున్నాయి.. దీంతో అంత్యక్రియలు ఆలస్యమవుతున్నాయి.. కారణం శవపేటికల కొరత.. హాంకాంగ్‌లో కరోనా సృష్టించిన విలయం ఇది. గ్లోబల్ ఫైనాన్షియల్ హబ్ హాంకాంగ్‌లో విషాద వాతావరణం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. చైనాతో పాటు హాంకాంగ్‌లో కూడా కరోనావైరస్
మార్చురీలకు శవాలు భారీగా వస్తున్నాయి.. దీంతో అంత్యక్రియలు ఆలస్యమవుతున్నాయి.. కారణం శవపేటికల కొరత.. హాంకాంగ్‌లో కరోనా సృష్టించిన విలయం ఇది. గ్లోబల్ ఫైనాన్షియల్ హబ్ హాంకాంగ్‌లో విషాద వాతావరణం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. చైనాతో పాటు హాంకాంగ్‌లో కూడా కరోనావైరస్ ప్రతాపం చూపిస్తోంది. ప్రస్తుతం అక్కడ ఫిఫ్త్ వేవ్ కొనసాగుతోంది. హాంకాంగ్ వ్యాప్తంగా ఇప్పటి వరకూ ఒక మిలియన్ జనాభా కొవిడ్ బారిన పడింది.. దాదాపు 8 వేల మంది మరణించినట్లు సమాచారం.హాంకాంగ్‌లో కరోనా విలయంతో మరణాలు పెరిగిపోయాయి.. ఏ మార్చురీ చూసినా మృత దేహాలతో నిండిపోయి కనిస్తోంది.. దానికి తోడు శవపేటికల కొరతతో అంత్యక్రియల ఏర్పాట్లలో తీవ్ర జాప్యం జరుగుతోంది.. మార్చురీలో ఇంత పెద్ద సంఖ్యలో మృత దేహాలు పోడవడం గతంలో ఎన్నడూ చూడలేదంటున్నారు ఓ ప్యూనరల్ హౌస్ నిర్వాహకుడు.. అక్కడ సాధారణంగా నెలకు 15 అంత్యక్రియలు జరుగుతాయి.. గత మార్చి నెలలో ఏకంగా 40 అంత్యక్రియలు జరిగాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.. ఇక్కడ సాధారణ రోజుల్లో రోజుకు 250 నుంచి 300 శవపేటికలు అవసరం.. ఇప్పడు మరణాల సంఖ్య పెరగడంతో వాటికి డిమాండ్ పెరిగిపోయింది.. మార్చి 14 నుండి 26 వరకు 3,570 శవపేటికలను ఉపయోగించారు. చైనాలోని షెన్‌జెన్ నుంచి హాంకాంగ్‌కు శవపేటికలు సరఫరా అవుతాయి. అయితే చైనాలో కూడా కరోనా కేసులు పెరగడంతో వీటి రవాణా నిలిచిపోయింది. దీంతో హాంకాంగ్‌లో అంత్యక్రియలు నిర్వహణ ఒక సమస్యగా మారిపోయింది. ఈ సమస్యను అదిగమించేందుకు అక్కడి అధికారులు చేస్తున్న ప్రయత్నాలు అంతగా ఫలించడంలేదు.
మరిన్ని చూడండి ఇక్కడ:
Ram Charan-Urfi Javed: రామ్ చరణ్ కు పడిపోయిన.. బాలీవుడ్ శృంగార తార.. ఓపెన్ ఆఫర్ అంటూ ఇలా..
Viral Video: మరికొద్ది క్షణాల్లో పెళ్లి.. మండపంలోకి మాజీ ప్రియుడి ఎంట్రీతో సీన్ రివర్స్..
Chimpanzee video: తగ్గేదే లే..! ఎంజాయ్ మీకే కాదు మాకు ఉంటది.. గేమ్స్‌తో చిల్ అవుతున్న చింపు..
Funny Video: అట్లుంటది మనతోని మరి.. ఒంటెతో యువతి సెల్ఫీ.. ఆ ఒంటె ఏంచేసిందో చూస్తే నవ్వాపుకోలేరు..!
సంక్రాంతి రైళ్లు హౌస్‌ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు

