strangest person: ప్రపంచంలోనే వింతైన వ్యక్తి.. రెండు ముఖాలు కలిగిన ఎడ్వర్డ్ మోర్డేక్ కథగా భావించే నిజమైన నిజం..
ప్రపంచంలోనే వింతైన ఓ వ్యక్తి గురించి ఇప్పుడు తెలుసుకోబోతున్నాం.ఇంగ్లండ్‌కు చెందిన ఎడ్వర్డ్ మోర్డేక్ అనే ఇతడికి రెండు ముఖాలు ఉంటాయి. అందులో ఒకటి చాలా అందంగా ఉంటే మరొకటి అంద విహీనంగా ఉంటుంది.
ప్రపంచంలోనే వింతైన ఓ వ్యక్తి గురించి ఇప్పుడు తెలుసుకోబోతున్నాం.ఇంగ్లండ్‌కు చెందిన ఎడ్వర్డ్ మోర్డేక్ అనే ఇతడికి రెండు ముఖాలు ఉంటాయి. అందులో ఒకటి చాలా అందంగా ఉంటే మరొకటి అంద విహీనంగా ఉంటుంది. ఈ రెండు ముఖాల కారణంగా అతను ఏమీ చేయలేకపోయేవాడు.. సరిగ్గా మాట్లాడలేకపోయేవాడు కూడా. ఇక రాత్రి నిద్రపోదామంటే ఒక ముఖం నిద్రపోయేది.. రెండో ముఖం మాత్రం మేల్కొని మాట్లాడుతూనే ఉండేది. మీడియా నివేదికల ప్రకారం1985లో బోస్టన్ పోస్ట్ అనే వార్తాపత్రికలో ఒక నివేదిక ప్రచురించారు. అందులో ఎడ్వర్డ్ రహస్యమైన కథ గురించి చెప్పారు. ఎడ్వర్డ్ తన మరో ముఖంతో విసిగిపోయాడని ఆ నివేదికలో రాశారు. ఆ ముఖం వల్ల నిద్రలేని రాత్రులు గడిపాడని, ఈ వింత సమస్య గురించి అతను చాలా మంది వైద్యులను కలిసినా ఫలితం లేకపోయిందని తెలిపారు. చాలా మంది వైద్యులు చికిత్స చేసేందుకు కూడా నిరాకరించినట్లు వివరించారు. ఇక ఎడ్వర్డ్ తర 37 సంవత్సరాల వయస్సులో ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. ఎడ్వర్డ్ యొక్క ఈ వింత కథ 1896 నాటి మెడికల్ ఎన్‌సైక్లోపీడియాలో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. చాలా మంది దీనిని కేవలం ఒక కథగా భావిస్తారు కానీ ఇది నిజమని నమ్మరు.
మరిన్ని చూడండి ఇక్కడ:
Viral Video: మరికొద్ది క్షణాల్లో పెళ్లి.. మండపంలోకి మాజీ ప్రియుడి ఎంట్రీతో సీన్ రివర్స్..
Chimpanzee video: తగ్గేదే లే..! ఎంజాయ్ మీకే కాదు మాకు ఉంటది.. గేమ్స్‌తో చిల్ అవుతున్న చింపు..
Funny Video: అట్లుంటది మనతోని మరి.. ఒంటెతో యువతి సెల్ఫీ.. ఆ ఒంటె ఏంచేసిందో చూస్తే నవ్వాపుకోలేరు..!