Hanuman Shobha Yatra: కొనసాగుతున్న హనుమాన్ శోభయాత్ర.. ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
Hanuman Shobha Yatra: హనుమాన్ జయంతి సందర్భంగా వీరహనుమాన్ శోభయాత్ర హైదరాబాద్ నగరంలో ఘనంగా ప్రారంభమైంది. గౌలిగూడ రామమందిరం..
Hanuman Shobha Yatra: హనుమాన్ జయంతి సందర్భంగా వీరహనుమాన్ శోభయాత్ర హైదరాబాద్ నగరంలో ఘనంగా ప్రారంభమైంది. గౌలిగూడ రామమందిరం నుంచి ప్రారంభమైన ఈ యాత్రలో భారీ ఎత్తున భక్తులు (Devotees) తరలివచ్చారు. వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్ ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం ప్రారంభమైన యాత్ర.. రాత్రి 8 గంటలకు ముగియనుంది. మరో వైపు హనుమాన్ శోభయాత్రను ప్రశాంతంగా ముగిసే విధంగా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు జరుగకుండా భారీ ఎత్తున భద్రతను ఏర్పాటు చేశారు. సుమారు 8 వేల పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు. గౌలిగూడ రామ్‌మందిర్ నుంచి తాడ్‌బండ్‌లోని వీరాంజనేయస్వామి దేవాలయం వరకూ 21 కి.మీ. మేర యాత్ర కొనసాగనుంది.
నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు:
- హనుమాన్ శోభయాత్ర సందర్భంగా నగరంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు.
- శనివారం ఉదయం11 గంటల నుంచి రాత్రి 8 గంటలకు వరకు ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి.
- ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు గౌలిగూడ రామ్‌మందిర్ నుంచి ఆంధ్రా బ్యాంక్ కోఠి వరకు.
- మధ్యాహ్నం 12.30 నుంచి 1.30 గంటల వరకు కోఠీలోని డీఎంహెచ్ కార్యాలయం నుంచి కాచిగూడ క్రాస్‌రోడ్స్ వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి.
- మధ్యాహ్నం 1.30 గంటల నుంచి 2.15 గంటల వరకు కాచిగూడ క్రాస్‌రోడ్స్ నుంచి నారాయణగూడ వరకు.
- మధ్యాహ్నం 2.15 నుంచి 4.15 గంటల వరకు ఆర్టీసీ క్రాస్ రోడ్, వీఎస్‌టీ, బాగ్‌లింగంపల్లి, ఇందిరాపార్క్, కవాడీగూడ, క్రాస్‌రోడ్స్ వరకు.
- సాయంత్రం 4.15 నుంచి 5.45 గంటల వరకు పాత రాంగోపాల్ పేట ఠాణా వరకు ట్రాఫిక్ ఆంక్షలు.
- సాయంత్రం 6 గంటల నుంచి7 వరకు ప్యారడైజ్ కూడలి నుంచి బ్రూక్‌బాండ్ కాలనీ వరకు ట్రాఫిక్ ఆంక్షలు.
- సాయంత్రం 7 నుంచి 8 గంటల వరకు బ్రూక్‌బాండ్ కాలనీ నుంచి తాడ్‌బండ్ వీరాంజనేయ స్వామి దేవాలయం వరకు.
ఇవి కూడా చదవండి: