AP Employees: ఏపీ సచివాలయ ఉద్యోగులకు కొత్త తలనొప్పి.. మూడు సార్లు అటెండెన్స్

AP Employees: ఏపీలోని సచివాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగులకు మరో తలనొప్పి వచ్చి పడింది. ఇప్పటికే ప్రొబేషన్‌ (Probation) ఖరారులో జాప్యంతో..

AP Employees: ఏపీ సచివాలయ ఉద్యోగులకు కొత్త తలనొప్పి.. మూడు సార్లు అటెండెన్స్
Follow us

|

Updated on: Apr 16, 2022 | 1:17 PM

AP Employees: ఏపీలోని సచివాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగులకు మరో తలనొప్పి వచ్చి పడింది. ఇప్పటికే ప్రొబేషన్‌ (Probation) ఖరారులో జాప్యంతో ఇబ్బందులు పడుతున్నవారికి మరిన్ని ఇబ్బందులు రానున్నాయి. ఏ ప్రభుత్వ శాఖల్లోనూ లేని విధంగా రోజులో మూడు సార్లు హాజరు తప్పనిసరి చేసే విధానం సచివాలయాల్లో (Sachivalayam)శనివారం నుంచి అమల్లోకి రానుంది. గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ఇందు కోసం ప్రత్యేక యాప్‌ను సైతం తీసుకువచ్చింది. దీన్ని ఉద్యోగులు తమ స్మార్ట్‌ ఫోన్ల (Smartphones)లో డౌన్‌లోడ్‌ చేసుకొని శనివారం నుంచి మూడుసార్లు హాజరు (Attendance) వేయాల్సి ఉంటుంది. ఉదయం 10 గంటల్లోపు, మధ్యాహ్నం 3 గంటలకు, సాయంత్రం 5 గంటలకు హాజరు తప్పనిసరిగా వేసుకోవాల్సి ఉంటుంది. అయితే మొబైల్‌ ఫోన్లు లేనివారు సచివాలయాలకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్మార్ట్‌ఫోన్‌లు ఉపయోగించుకోవాలి.

ఈ విధానం అమల్లోకి రావడంతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. 2019 అక్టోబరులో విధుల్లో చేరిన గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల ప్రొబేషన్‌ 2021 అక్టోబరులో ఖరారు చేయాలి. అయితే శాఖాపరమైన పరీక్షల్లో చాలామంది ఉత్తీర్ణులు కాలేదన్న ఉద్దేశంతో 2022 జూన్‌లో అందరి ప్రొబేషన్‌ ఒకేసారి ఖరారు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కొన్ని రోజుల నెలల క్రితం ఆదేశించారు. ఏప్రిల్‌ మొదటి వారంలో ఏపీ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించిన శాఖపరమైన పరీక్షల్లో చాలా మంది ఉద్యోగులు ఉత్తర్ణత కాలేదు. దీంతో ప్రొబేషన్‌ ఖరారుపై ఆదేశాలు వచ్చాయి. ఇలాంటి సమయంలో రోజులో మూడు సార్లు బయోమెట్రిక్‌ తప్పనిసరి చేసింది.

సచివాలయ శాఖ మార్గదర్శకాలు జారీ:

కాగా, ఈ విధానాన్ని అమలు చేసేందుకు గ్రామ సచివాలయ శాఖ మార్గదర్శకాలను జారీ చేసింది. శనివారం అమలు కోసం రెండు రోజుల క్రితం యాప్‌ విడుదల చేశారు అధికారులు. దీనిని ఉద్యోగుల స్మార్ట్‌ఫోన్‌లలో డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే సచివాలయాల్లో నిర్వహించే స్పందన కార్యక్రమానికి ఉద్యోగులందరూ విధిగా హాజరు కావాలనే ఉద్దేశంతో ఈ మూడు పూటలా హాజరు విధానం తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి:

Andhra Pradesh News: కళ్యాణదుర్గంలో ఉద్రిక్తత.. చిన్నారి మృతితో రాజకీయ వేడి

PM Modi: 108 అడుగుల భారీ హనుమాన్‌ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోడీ