AP Crime: ప్రాణాలు తీస్తున్న క్రీడలు.. ఆటలాడుతూ కుప్పకూలిన ఆటగాళ్లు.. ఆపై

శారీరక, మానసిక ఆరోగ్యాన్ని అందించేందుకు ఆటలు(Sports) ఎంతగానో సహాయపడతాయి. అందుకే ఆటలు ఆడేందుకు చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఆసక్తి కనబరుస్తారు. కానీ అవే క్రీడలు కబళించే మృత్యువుగా...

AP Crime: ప్రాణాలు తీస్తున్న క్రీడలు.. ఆటలాడుతూ కుప్పకూలిన ఆటగాళ్లు.. ఆపై
Heart Attack
Follow us
Ganesh Mudavath

|

Updated on: Apr 16, 2022 | 12:23 PM

శారీరక, మానసిక ఆరోగ్యాన్ని అందించేందుకు ఆటలు(Sports) ఎంతగానో సహాయపడతాయి. అందుకే ఆటలు ఆడేందుకు చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఆసక్తి కనబరుస్తారు. కానీ అవే క్రీడలు కబళించే మృత్యువుగా మారితే.. ఊహించుకోవడమే భయంగా ఉంది. కానీ ఇలాంటి ఘటనలు నిజంగా జరుగుతున్నాయి. ఆరోగ్యాన్ని అందించాల్సిన ఆటలు.. కబళించే మృత్యుకూపాలుగా మారుతున్నాయి. తాజాగా జరిగిన ఈ రెండు ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. జగ్గయ్యపేటలోని(Jaggayyapet) ఓ ఇంజినీరింగ్ కాలేజీలో సివిల్ ఇంజినీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న చందు కు క్రికెట్( ఆడటం చాలా ఇష్టం. ఎప్పటిలాగానే నిన్న (శుక్రవారం) సాయంత్రం క్రికెట్ ఆడేందుకు వెళ్లాడు. ఫీల్డింగ్ లో ఉన్న సమయంలో బాల్ ను అందుకునేందుకు గాల్లో లేచాడు. అంతే ఒక్క సారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే అప్రమత్తమైన తోటి స్నేహితులు గమనించి పైకి లేపేందుకు ప్రయత్నించారు. చికిత్స కోసం జగ్గయ్యపేట ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కాసేపటికే చందు మృతి చెందాడు. మన్యం జిల్లాకు చెందిన తిరుపతిరావుకు ఇద్దరు కుమారులు. వీరిలో రెండో వాడైన చందు జగ్గయ్యపేటలో చదువుకుంటున్నాడు. మంచిగా చదువుకుని, జీవితంలో ఉన్నత స్థితిలో స్థిరపడతాడనుకున్న కుమారుడు ఇలా ఊహించని విధంగా చనిపోవడంపై ఆయన కన్నీరుమున్నీరుగా విలపించారు.

మరో ఘటనలో.. తిరుపతి పడమట పోలీస్ స్టేషన్ ప్రాంతాలనికి చెందిన ఎస్సై సుబ్రమణ్యం వయసు యాభై ఏడేళ్లు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా నిర్వహించిన కబడ్డీ పోటీల్లో ఆయన పాల్గొన్నారు. కూతకు వెళ్లి వస్తూ ఉన్నట్టుండి కుప్పకూలారు. వెంటనే రుయా ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు.

Also Read

PM Modi: ప్రధానమంత్రిని ఫిదా చేసిన చిన్నారి.. అయిగిరి నందిని స్తోత్రం విన్న మోడీ ఏమన్నారంటే..? వీడియో

Hyderabad: తలపై జుట్టు మొలిపిస్తామంటూ శఠగోపం పెట్టారు.. చీటింగ్ కంపెనీకి వినియోగదారుల కమిషన్ షాక్

Hanuman Jayanti: నేడే వీరహనుమాన్ శోభాయాత్ర.. నగరంలో ట్రాఫిక్ ఆంక్షల అమలు.. పూర్తి వివరాలివే

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!