PM Modi: 108 అడుగుల భారీ హనుమాన్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోడీ
PM Modi: దేశ వ్యాప్తంగా హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటున్నారు. అయితే హనుమాన్ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర..
PM Modi: దేశ వ్యాప్తంగా హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటున్నారు. అయితే హనుమాన్ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) శనివారం గుజరాత్ (Gujarat)లో పర్యటించారు. మోర్బీలో ఏర్పాటు చేసిన 108 అడుగుల భారీ హనుమాన్ విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆవిష్కరించారు. హనుమాన్జీ 4 ధామ్ ప్రాజెక్ట్‌లో భాగంగా దేశ నలు దిక్కుల్లో నాలుగు హనుమాన్ విగ్రహాలను ప్రతిష్ఠించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టగా, నేడు మోడీ ఆవిష్కరించారు. మరికొన్ని రోజుల్లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడ భారీ హనుమాన్ విగ్రహాన్ని రిమోట్ ద్వారా ఆవిష్కరించారు మోడీ. ఏప్రిల్ 18 నుంచి మోడీ గుజరాత్‌లో పర్యటించనున్నారు. మూడు రోజుల పాటు వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.
బాపూ కేశ్వానంద్ ఆశ్రమంలో విగ్రహం ఏర్పాటు:
అయితే దేశానికి పడమర దిక్కున ఉన్న మోర్బీలోని బాపూ కేశ్వానంద్ ఆశ్రమంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు ఏర్పాటు చేసిన విగ్రహాల్లో ఇది రెండవది. ఇక మొదటి విగ్రహాన్ని 2010లో ఉత్తరాదిన ఉన్న సిమ్లాలో ఏర్పాటు చేశారు. అలాగే దక్షిణ దిక్కున తమిళనాడులోని రామేశ్వరంలో విగ్రహానికి సంబంధించిన పనులు ప్రారంభించారు.
ఎత్తయిన ప్రదేశంలో ఏర్పాటైన అత్యంత ఎత్తయిన విగ్రహంగా రికార్డు నెలకొల్పింది. జాఖూలోని విగ్రహానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. దీని కోసం మొత్తం 1500 టన్నుల కాంక్రీట్, ఇనుము, రాళ్ళు ఉపయోగించారు. సిమ్లాలోని జాఖూలో బిగ్-బి అమితాబ్ బచ్చన్ అల్లుడు నందా నిర్మించిన హనుమాన్ విగ్రహం ‘గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లోనూ చోటు సంపాదించుకున్న విషయం తెలిసిందే.
విగ్రహం కోసం 178 అడుగుల లోతు పునాది:
విగ్రహం స్థిరంగా ఉండేందుకు 178 అడుగుల లోతుతో పునాది వేశారు. ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేయడానికి కారణం కూడా ఉంది. లక్ష్మణుడు మూర్ఛ పోయినప్పుడు హనుమంతుడు ఇక్కడే విశ్రాంతి తీసుకున్నాడని చరిత్ర చెబుతోంది. అందుకే అంత భారీ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు.
కాగా, హనుమాన్ జయంతి సందర్భంగా మోడీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. బలం, ధైర్యం, సంయమనానికి ప్రతీక అయిన హనుమంతుని జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. పవన్ పుత్ర దయతో ప్రతి ఒక్కరి జీవితాలు బాగుండాలని, తెలివి తేటలు, విజ్ఞానంతో నిండి ఉండాలని మోడీ కోరారు. ఈ మేరకు ప్రధాని మోడీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
PM Narendra Modi unveils a 108 ft statue of Hanuman ji in Morbi, Gujarat through video conferencing, on #HanumanJayanti. This statue is the second of the 4 statues being set up in 4 directions across the country, as part of #Hanumanji4dham project pic.twitter.com/jWcJLu2xNI
— ANI (@ANI) April 16, 2022
ఇవి కూడా చదవండి: