Property Auction: మీరు ప్రాపర్టీని కొనాలని ప్లాన్ వేస్తున్నారా? బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా అద్భుతమైన అవకాశం..!

Property Auction: మీరు ప్రాపర్టీలో పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేస్తుంటే లేదా కొత్త ప్రాపర్టీని కొనాలని ప్లాన్ చేస్తుంటే బ్యాంక్ ఆఫ్ బరోడా మీకు గొప్ప అవకాశాన్ని..

Property Auction: మీరు ప్రాపర్టీని కొనాలని ప్లాన్ వేస్తున్నారా? బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా అద్భుతమైన అవకాశం..!
Follow us

|

Updated on: Apr 16, 2022 | 11:14 AM

Property Auction: మీరు ప్రాపర్టీలో పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేస్తుంటే లేదా కొత్త ప్రాపర్టీని కొనాలని ప్లాన్ చేస్తుంటే బ్యాంక్ ఆఫ్ బరోడా మీకు గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda) ఏప్రిల్ 19వ తేదీ మంగళవారం మెగా ఇ-వేలాన్ని (Auction) నిర్వహిస్తోంది. బ్యాంక్ ఆఫ్ బరోడా ఈ ఇ – వేలంలో మీరు మీకు నచ్చిన ఆస్తిని చౌక ధరలకు కొనుగోలు చేయవచ్చు. బ్యాంకు ద్వారా వేలం వేయబడే ఆస్తులలో ఇళ్లతో పాటు ఆఫీసు స్థలం, దుకాణం, పారిశ్రామిక స్థలం కూడా ఉన్నాయి. ఈ ఇ-వేలంలో అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే వేలం వేయబడే ఆస్తులు వివిధ బడ్జెట్ శ్రేణులలో అందుబాటులో ఉంటాయి. మీరు మీ బడ్జెట్ ప్రకారం.. ఏదైనా ఆస్తిని కొనుగోలు చేయవచ్చు.

నివేదికల ప్రకారం.. బ్యాంకు ఆఫ్‌ బరోడా(BoB) నిర్వహించిన ఈ వేలంలో ఎవరైనా తనకు నచ్చిన ఆస్తి కోసం వేలంలో పాల్గొనవచ్చు. వీలైనంత త్వరగా దానిని స్వాధీనం చేసుకోవచ్చు. ఇది కాకుండా మీరు ఆస్తిని కొనుగోలు చేయడానికి రుణం కావాలనుకుంటే కూడా రుణం లభిస్తుంది. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఈ-వేలం గురించి మరింత సమాచారం కోసం మీరు బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ https://www.bankofbaroda.in/e-auction/e-auction-property-search ని కూడా సందర్శించవచ్చు .

మీరు బ్యాంక్ వెబ్‌సైట్‌లో ఆస్తికి సంబంధించిన అన్ని అవసరమైన సమాచారాన్ని పొందుతారు. బ్యాంక్ వేలం వేయబోయే ఆస్తులు ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్, గుజరాత్‌లోని అహ్మదాబాద్, సబర్‌కాంతలో ఉన్నాయని బ్యాంకు తెలిపింది. ఈ వేలంలో ఆస్తి ప్రారంభ రిజర్వ్ ధర రూ. 5 లక్షల 40 వేల నుండి రూ. 1 కోటి 50 లక్షల వరకు ఉంటుందని తెలిపింది.

బ్యాంకులు ఏ ఆస్తులకు వేలం వేస్తాయి?

బ్యాంకు ద్వారా వేలం వేయబడిన ఆస్తి గురించి మీరు తప్పక తెలుసుకోవాలి. ఇవి రుణం రికవరీగా స్వాధీనం చేసుకున్న ఆస్తులు, మొత్తం రికవరీ కోసం వేలం వేయబడతాయి. వాస్తవానికి బ్యాంకుల నుండి రుణం తీసుకుని, కొన్ని కారణాల వల్ల రుణ మొత్తాన్ని తిరిగి చెల్లించలేని వ్యక్తులు, బ్యాంకులు వారి ఆస్తులను వారి స్వాధీనంలోకి తీసుకుని, వారి రుణాన్ని రికవరీ చేయడానికి వేలం వేస్తాయి.

ఇవి కూడా చదవండి:

ఇవి కూడా చదవండి:

Petrol Diesel Price Today: దేశంలో ఊరటనిస్తున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు..!

nvestment: బ్యాంక్ డిపాజిట్స్ vs మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ కి ఏది బెస్ట్? తెలుసుకోండి..