Railway News: భారీగా పెరిగిన డీజిల్ ధరలు.. ఆర్థిక భారం తగ్గించుకునేందుకు ఆ ఆలోచనలో రైల్వే శాఖ

Railway News: సామాన్య ప్రయాణికులపై పెరుగుతున్న ఇంధన ధరల(Fuel Prices) భారం పడకుండా చూసేందుకు భారతీయ రైల్వేస్ ప్రయత్నాలు ప్రారంభించింది.

Railway News: భారీగా పెరిగిన డీజిల్ ధరలు.. ఆర్థిక భారం తగ్గించుకునేందుకు ఆ ఆలోచనలో రైల్వే శాఖ
Railway
Follow us
Ayyappa Mamidi

|

Updated on: Apr 16, 2022 | 11:04 AM

Railway News: సామాన్య ప్రయాణికులపై పెరుగుతున్న ఇంధన ధరల(Fuel Prices) భారం పడకుండా చూసేందుకు భారతీయ రైల్వేస్ ప్రయత్నాలు ప్రారంభించింది. ద్రవ్యోల్బణం(Inflation) కారణంగా ఇప్పటికే అనేక వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయి. ఈ సమయంలో సరకు రవాణాకు డీజిల్ ఇంజన్లను వినియోగించటం వల్ల ఆ ప్రభావం రవాణా ఖర్చుల పెరుగుదలకు కారణం కాకుండా ఉండేందుకు మరో నిర్ణయంతో ముందుకొచ్చింది. వరుసగా పెరుగుతున్న ఇంధన ధరలు ఇప్పుడు రైల్వేలపైన కూడా పడుతోంది. అందువల్ల భారతీయ రైల్వేలు ఇంధన ధరల ఖర్చు తగ్గించేందుకు ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించింది.

డీజిల్ లోకోమోటివ్‌లను బయో-డీజిల్‌ వినియోగించి నడపాలని నిర్ణయించింది. ఇందుకోసం ఇతర ఇంధనాలతో కలపాలని యోచిస్తోంది. రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ (RDSO) ద్వారా B-5 బయో-డీజిల్‌తో డీజిల్ లోకోమోటివ్‌ల ఆపరేషన్‌ను పరీక్షించినట్లు భారతీయ రైల్వే పార్లమెంటులో తెలియజేసింది. పూర్తి స్థాయిలో రైలు ఇంజన్లను బయో-డీజిల్‌ వినియోగించేందుకు ముందు టెస్ట్ పైలెట్ నిర్వహించనున్నట్లు సంబంధిత అధికారులు చెప్పారు. బయో-డీజిల్‌ను ఉపయోగించడం వల్ల రైల్వేలు దాని డీజిల్ బిల్లు ఆదా కానుంది. దీనికి తోడు వాటి నుంచి వచ్చే కాలుష్యం, ఉద్గారాలు తగ్గుతాయని తెలుస్తోంది.

2018-19; 2019-20లో సరుకు రవాణా, పన్నులు, ఇతర వాటితో సహా హై-స్పీడ్ డీజిల్ ధర వరుసగా ₹18,587.14 కోట్లు, ₹16,030.58 కోట్లుగా ఉంది. 2023 చివరి నాటికి రైల్వేలను 100% విద్యుదీకరణ చేయాలని ఇప్పటికే భారత రైల్వేలు నిర్ణయించింది. దీనివల్ల డీజిల్ ఖర్చు తగ్గుతుందని అధికారులు అంచనా వేసినప్పటికీ.. ఎక్కువ సరకును మోసుకెళ్లే సామర్థ్యం కారణంగా డీజిల్ లోకోమోటివ్‌లను మరికొంత కాలం కొనసాగనున్నాయి.

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవీ చదవండి..

Rakesh Jhunjhunwala: ఆ కంపెనీలో వాటాలు పెంచుకున్న బిగ్ బుల్ రాకేశ్‌ జున్‌జున్‌వాలా.. మీ దగ్గర కూడా ఈ షేర్ ఉందా..

Srilanka Crisis: భారత కంపెనీలకు లంకంత కష్టం.. తలకిందులైన పరిస్థితులు.. ఎందుకంటే..