Telangana Cabinet: తెలంగాణ కేబినెట్ వర్సెస్ ఆంధ్రా కేబినెట్.. క్యాస్ట్ ఫార్ములాపై చర్చలు
ఇక్కడ ఔట్.. అక్కడ ఇన్. అక్కడ అవుట్ బట్ నాట్ అవుట్.. ఇదేదో క్రికెట్ మ్యాచ్ సమాచారం అనుకునేరు. అస్సలు కాదండోయ్. తెలంగాణ కేబినెట్(Telangana Cabinet) వర్సెస్ ఏపీ కేబినెట్(AP Cabinet) గురించి జరుగుతున్న చర్చ....
ఇక్కడ ఔట్.. అక్కడ ఇన్. అక్కడ అవుట్ బట్ నాట్ అవుట్.. ఇదేదో క్రికెట్ మ్యాచ్ సమాచారం అనుకునేరు. అస్సలు కాదండోయ్. తెలంగాణ కేబినెట్(Telangana Cabinet) వర్సెస్ ఏపీ కేబినెట్(AP Cabinet) గురించి జరుగుతున్న చర్చ. అదేంటి ఈ రెండు రాష్ట్రాల కేబినెట్ లకు సంబంధం ఏంటి అనుకున్నారా. అదే కేబినెట్- క్యాస్ట్ ఫార్ములా(Cast Formula).. రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తరువాత రెండిటి మధ్య పోలికలను చూడడం ప్రజలకు కామన్ గా మారిపోయింది. పరిపాలన, పథకాలు, రాజకీయాల దగ్గర్నుంచి ప్రతి అంశాన్నీ పోల్చి చూస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ కేబినెట్ విస్తరణపై కూడా ఇలాంటి ఆసక్తికర చర్చ మొదలైంది. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ విస్తరణ జరిగాక ఇక తెలంగాణ కేబినెట్ లో మార్పులు ఉంటాయని అంతా భావించారు. అదేదీ ఉండదని కలిశాక సామాజిక వర్గాల వారీగా కేబినెట్ లెక్కలు వేయడం మొదలుపెట్టారు. తెలంగాణలో అత్యధిక జనాభా కలిగిన క్యాస్ట్ ముదిరాజులు. తెలంగాణ వచ్చిన వెంటనే ఈ విషయాన్ని గమనించిన కేసీఆర్ వారి కోసం ప్రత్యేక పథకాలు ప్రారంభించారు. ఈటల రాజేందర్ కు కీలక మంత్రి పదవులు ఇస్తూనే మరికొందరికీ పదవులు కల్పించారు.
కానీ గతంలో జరిగిన పరిణామాలతో ఈటల రాజేందర్ కేబినెట్ నుంచి అవుటయ్యారు. కానీ ఆంధ్రప్రదేశ్ కేబినెట్ లో అదే సామాజిక వర్గానికి చెందిన విడదల రజిని మంత్రి పదవి దక్కించుకున్నారు. నిజానికి తెలంగాణలో ఉన్నంత ముదిరాజుల జనాభా ఆంధ్రప్రదేశ్ లో లేదు. ఇక ఆంధ్రప్రదేశ్ లో కమ్మ సామాజిక వర్గానికి స్థానం లేకుండా చరిత్రలో ఎప్పుడూ ప్రభుత్వాలు లేవు. అయినా ఈసారి విస్తరణలో కమ్మలకు చోటు దక్కలేదు. అప్పటి వరకు మంత్రిగా కొనసాగినా ఆ సామాజిక వర్గానికి చెందిన కొడాలి నాని కూడా అక్కడ ఔటయ్యారు.
తెలంగాణలో కమ్మ సామాజిక వర్గం ప్రభావిత స్థాయిలో లేకపోయినా ఇక్కడ అ మంత్రి పదవితో పాటు అన్ని పదవుల్లోనూ సముచిత ప్రాధాన్యం దక్కింది. అక్కడ కొడాలి నాని ఔట్ అయినా.. ఇక్కడ పువ్వాడ అజయ్ మాత్రం సేఫ్ ప్లేస్ లోనే ఉన్నారు. ఇలా కుల రాజకీయ సమీకరణాలపై రెండు రాష్ట్రాల్లోనూ ఆసక్తికర చర్చ కొనసాగుతోంది.
Also Read
Credit Card: ఆ క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా.. రూ.35 వేలు డిస్కౌంట్ పొందండిలా..!
IPL 2022: ఆ ప్లేయర్ ఐపీఎల్ ఆడకపోయినా 14 కోట్లు కచ్చితంగా చెల్లించాల్సిందే..!
Coronavirus: వెయ్యికి దిగువన కరోనా కేసులు.. దేశంలో నిన్న ఎంతమంది మరణించారంటే..?