Credit Card: ఆ క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా.. రూ.35 వేలు డిస్కౌంట్ పొందండిలా..!

Credit Card: సమ్మర్ వెకేషన్‌కు వెళ్లాలని చాలా మందికి ఉంటుంది. అలాంటి వారికే ఈ గుడ్ న్యూస్. మీకోసం అదిరే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. పూర్తి వివరాలు..

Credit Card: ఆ క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా..  రూ.35 వేలు డిస్కౌంట్ పొందండిలా..!
Credit Card
Follow us

|

Updated on: Apr 16, 2022 | 1:41 PM

Credit Card: సమ్మర్ వెకేషన్‌కు వెళ్లాలని చాలా మందికి ఉంటుంది. అలాంటి వారికే ఈ గుడ్ న్యూస్. మీకోసం అదిరే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఫ్లైట్ టికెట్ బుకింగ్, హోటల్ బుకింగ్స్ వంటి వాటిపై తగ్గింపు పొందేందుకు క్రెడిట్ కార్డు వినియోగదారులకు అవకాశం ఉంటుంటుంది. ఇప్పుడు అమెరికన్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ కార్డు వారికి ఒక సూపర్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ క్రెడిట్ కార్డు మీ దగ్గర ఉంటే.. ట్రావెల్ సమయంలో చాలా డబ్బు ఆదా అవుతుంది. ఈ బ్యాంక్ తన క్రెడిట్ కార్డు వినియోగదారులకు రూ. 2 వేల నుంచి ఏకంగా రూ. 35 వేల వరకు తగ్గింపు ప్రయోజనాలను అందిస్తోంది. అసలు ఈ ఆఫర్లు ఎలా ఉన్నాయి.. వాటిని ఎలా పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..

మేక్‌ మై ట్రిప్ లో అమెరికన్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ వినియోగించి బుకింగ్స్ చేసుకుంటే డబ్బు ఆదా చేసుకోవచ్చు. డొమెస్టిక్ ఫ్లైట్స్‌పై 15 శాతం వరకు డిస్కౌంట్ అందుబాటులో ఉంది. గరిష్టంగా రూ.2 వేల వరకు తగ్గింపును వినియోగదారులు టికెట్లు బుకింగ్ లో పొందొచ్చు. అలాగే డొమెస్టిక్ హోటల్ బుకింగ్‌పై 15 శాతం లేదా రూ. 5 వేల వరకు తగ్గింపు లభిస్తోంది. దీనికి MMTAMEX అనే ప్రోమో కోడ్ ఉపయోగించాలి. జూన్ 25 వరకు ఈ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

విదేశీ ప్రయాణాలు చేసేవారికి..

విదేశీ ప్రయాణాల కోసం విమాన టికెట్లు ఈ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేసేవారికి 10 శాతం తగ్గింపు ఉంది. గరిష్టంగా రూ.10 వేల వరకు డిస్కౌంట్ వినియోగదారులు పొందవచ్చు. అయితే మినిమమ్ ట్రాన్సాక్సన్ విలువ రూ.15 వేలు ఉండాలని షరతు ఉంది. ఇంకా అంతర్జాతీయ హోటల్ బుకింగ్‌పై ఏకంగా 15 శాతం వరకు తగ్గింపు ఉంది. దీని కింద గరిష్ఠంగా రూ.35 వేల వరకు తగ్గింపు పొందవచ్చు. ఇందుకోసం MMTAMEXINT అనే ప్రోమో కోడ్ ను వినియోగదారులు ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ ఆఫర్ జూన్ 24 వరకు అందుబాటులో ఉంటుంది.

షరతులు..

ఆఫర్ బేసిక్ అండ్ సప్లిమెంటరీ కార్డులకు వర్తిస్తుంది. అలాగే ఒక కార్డుపై ఒక కేటగిరిలో ఒకసారి మాత్రమే బుకింగ్ చేసుకోగలం. డొమెస్టిక్ ఫ్లైట్స్, హోటల్స్ బుకింగ్‌ను శనివారం రోజున మాత్రమే చేసుకోవాలి. ఇంటర్నేషనల్ ఫ్లైట్స్, హోటల్ బుకింగ్ శుక్రవారం రోజున చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ట్రావెల్ చేయడం లేదంటే స్టే చేయడం అనేది వారంలో ఎప్పుడైనా ఉండొచ్చు. ఎంపిక చేసిన ఇంటర్నేషనల్, డొమెస్టిక్ హోటల్స్‌కు మాత్రమే ఈ ఆఫర్లు వర్తిస్తాయి. ఇండియా నుంచి బయలుదేరే విమానాలకు మాత్రమే ఆఫర్ అందుబాటులో ఉంది.

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవీ చదవండి..

Rising Prices: కూరగాయలూ కొనలేమంటున్న సామాన్యులు.. సర్వేలో షాకింగ్ విషయాలు.. బాదుడు ఆగదా..?

Sports18: స్పోర్ట్స్ ప్రియులకు శుభవార్త.. జియో నుంచి సరికొత్త ఛానల్..

Latest Articles