IPL 2022: ఆ ప్లేయర్ ఐపీఎల్ ఆడకపోయినా 14 కోట్లు కచ్చితంగా చెల్లించాల్సిందే..!
IPL 2022: IPL 2022 మెగా వేలంలో చెన్నై సూపర్ కింగ్స్‌కు చెందిన దీపక్ చాహర్ అత్యధిక ధర పలికిన ఆటగాళ్లలో ఒకరు. ఇషాన్ కిషన్ తర్వాత ఎక్కువ డబ్బు సంపాదించాడు.
IPL 2022: IPL 2022 మెగా వేలంలో చెన్నై సూపర్ కింగ్స్‌కు చెందిన దీపక్ చాహర్ అత్యధిక ధర పలికిన ఆటగాళ్లలో ఒకరు. ఇషాన్ కిషన్ తర్వాత ఎక్కువ డబ్బు సంపాదించాడు. ఈ ఇండియన్ ఆల్ రౌండర్‌ని చెన్నై సూపర్ కింగ్స్ 14 కోట్లకి కొనుగోలు చేసింది. కానీ దురదృష్టవశాత్తు దీపక్ చాహర్ అన్ ఫిట్ అయ్యాడు. గాయం కారణంగా లీగ్ నుంచి ఔట్ అయ్యాడు. ఐపీఎల్ 15వ సీజన్‌లో రూ.14 కోట్ల ఆటగాడు చెన్నై సూపర్ కింగ్స్‌కు ఎటువంటి సహకారం అందించలేకపోయాడు. ఇంత జరిగినా అతనికి వచ్చే జీతంలో ఎటువంటి కోత ఉండదు. వాస్తవానికి దీపక్ చాహర్‌కు ఏం జరిగిందో తెలుసుకోవడం ముఖ్యం. నిజానికి వెస్టిండీస్‌తో స్వదేశంలో జరిగిన సిరీస్‌లో దీపక్ చాహర్ గాయంతో బాధపడ్డాడు. అతను ఆ గాయం నుంచి కోలుకొని ఐపీఎల్ ఆడటానికి చాలా ప్రయత్నించాడు. కానీ వీలుపడలేదు. తర్వాత వైద్యులు అతడికి స్కాన్ చేసి 4 నెలల పాటు క్రికెట్‌కు దూరంగా ఉండాలని సూచించారు. IPL 2022 నుంచి అతడు తప్పకోవడానికి ఇదే కారణం.
దీపక్ చాహర్ నిష్క్రమణ కారణంగా చెన్నై సూపర్ కింగ్స్‌కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇక ఈ షాక్ ప్రభావం టోర్నీలో జట్టు ప్రదర్శనపై కూడా కనిపిస్తోంది. కానీ ఇంత జరిగినా చాహర్‌కి పూర్తి జీతం చెల్లించాల్సిందే. ఎందుకంటే అతను వ్యక్తిగత కారణాల వల్ల టోర్ని నుంచి తన పేరుని ఉపసంహరించుకోలేదు. గాయం కారణంగా IPL తప్పుకున్నాడు. ఇది కాకుండా BCCIతో వార్షిక ఒప్పందం ఉన్న ఆటగాళ్లలో చాహర్ కూడా ఉన్నాడు. BCCI 2011 సంవత్సరంలో ఆటగాళ్ల కోసం బీమా పాలసీని రూపొందించింది. దీని కింద BCCIతో ఒప్పందం చేసుకున్న ఆటగాళ్లకి వారి గ్రేడ్ కింద పూర్తి జీతం లభిస్తుంది. బీసీసీఐతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం దీపక్ చాహర్ గ్రేడ్ సి ఆటగాడు. ఈ కారణంగా అతను మొత్తం జీతాన్ని పొందుతాడు.