Viral Video: పిల్లవాడు చేసిన తమాషా పనికి నవ్వు ఆపుకోలేరు..!

Viral Video: సోషల్‌ మీడియాలో ప్రతిరోజు చాలా వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. ఇందులో చాలా రకాల వీడియోలు ఉంటాయి. నెటిజన్లు వీటిని ఎక్కువగా చూస్తారు. లైక్స్‌,

Viral Video: పిల్లవాడు చేసిన తమాషా పనికి నవ్వు ఆపుకోలేరు..!
Little Kid Crying
Follow us
uppula Raju

|

Updated on: Apr 16, 2022 | 11:48 AM

Viral Video: సోషల్‌ మీడియాలో ప్రతిరోజు చాలా వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. ఇందులో చాలా రకాల వీడియోలు ఉంటాయి. నెటిజన్లు వీటిని ఎక్కువగా చూస్తారు. లైక్స్‌, కామెంట్స్‌తో అలరిస్తారు. వాస్తవానికి సోషల్‌ మీడియాలో చిన్న పిల్లల వీడియోలు తరచుగా వైరల్‌గా మారుతాయి. ఎందుకంటే వారు చేసే కొంటె పనులు చాలా తమాషాగా ఉంటాయి. నెటిజన్ల ఇలాంటి వీడియోలని చూసి తెగ నవ్వుకుంటారు. చిన్న వయసులో వారు చేసే పనులు ఒక్కోసారి ఆశ్చర్యానికి గురిచేస్తాయి. తాజాగా ఒక చిన్న పిల్లాడి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు ఈ వీడియోని చూసి నవ్వు ఆపుకోలేకపోతున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందో మనం తెలుసుకుందాం.

వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఒక చిన్నపిల్లవాడు నడుచుకుంటు వెళ్లడం మనం వీడియోలో గమనించవచ్చు. కొద్దిసేపటికి ఆ పిల్లాడు ఎదురుగా ఒక కుక్కని చూస్తాడు. అది అతడిని చూసి మొరుగుతూ ఉంటుంది. పిల్లవాడు భయపడకుండా దాని వైపు అడుగులు వేస్తాడు. ఇంతలో కుక్క పిల్లాడి వైపునకు వేగంగా రావడం ప్రారంభిస్తుంది. దీంతో పిల్లవాడు బిగ్గరగా ఏడుస్తూ కుటుంబ సభ్యల దగ్గరకి పరుగెత్తడం మనం వీడియోలో చూడవచ్చు. మొదట ధైర్యంగా అడుగులు వేసిన పిల్లవాడు చివరకి భయంతో పరుగులు పెట్టాల్సి వచ్చింది ఈ వీడియో చూసిన నెటిజన్లు పిల్లవాడి వైఖరి చేసి తెగ నవ్వుకుంటున్నారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. తమాషా వీడియోని చూసి నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియోని ఒక నెటిజన్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఇప్పటివరకు ఈ వీడియోని 2 లక్షల 8 వేల మంది చేశారు. 10 వేల మందికి పైగా వీడియోను లైక్ చేసారు. వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ రియాక్షన్లు ఇస్తున్నారు. మీరు కూడా ఈ వీడియోని చేసినట్లయితే మీ కామెంట్‌ తెలియజేయండి.

Health Tips: దోసకాయ, కొత్తిమీర జ్యూస్‌తో బోలెడు లాభాలు.. డీ హైడ్రేషన్‌కి చక్కటి పరిష్కారం..!

SBI Special Offer: ఎస్బీఐ ఖాతాదారులకి బంపర్‌ ఆఫర్.. వాటికోసం ప్రత్యేక రుణం..!

Hanuman jayanti 2022: హనుమాన్ జయంతి సందర్భంగా భక్తులు మరిచిపోయి కూడా ఈ తప్పులు చేయకండి..!