SBI Special Offer: ఎస్బీఐ ఖాతాదారులకి బంపర్ ఆఫర్.. వాటికోసం ప్రత్యేక రుణం..!
SBI Special Offer: ప్రస్తుతం దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. రోజు రోజుకి ఇంధన ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో సామాన్యులు వాహనాలని
SBI Special Offer: ప్రస్తుతం దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. రోజు రోజుకి ఇంధన ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో సామాన్యులు వాహనాలని బయటకి తీయాలంటే జంకుతున్నారు. ఇదిలా ఉంటే కొత్తగా వాహనాలు కొనాలనుకునేవారు ఎలక్ట్రిక్ వాహనాలపై మొగ్గు చూపుతున్నారు. వీటి వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలు కాలుష్యాన్ని తగ్గించడమే కాకుండా ఇంధన ఖర్చులను కూడా ఆదా చేస్తాయి. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్‌తో నడిచే వాహనాల కంటే ఎలక్ట్రిక్ వాహనాలు చాలా ఖరీదైనవి. అయితే వివిధ బ్యాంకులు ఎలక్ట్రిక్ వాహనాల కోసం ప్రత్యేక లోన్లని మంజూరు చేస్తున్నాయి. ఎస్బీఐ కూడా తన కస్టమర్లకి ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. తక్కువ EMIతో ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనుగోలు చేయాలనే మీ కల సాకారమవుతుంది. ఈ ఆఫర్ గురించి వివరంగా తెలుసుకుందాం.
ఎస్బీఐ ప్రత్యేక ఆఫర్
ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసే కస్టమర్లకు ఎస్‌బీఐ ప్రత్యేక రుణాలని మంజూరు చేస్తోంది. ఈ రుణాల కింద కస్టమర్లు 20 బేసిస్ పాయింట్ల అదనపు తగ్గింపును పొందుతారు. అలాగే రుణం ప్రాసెసింగ్ ఫీజు మాఫీ చేస్తారు. బ్యాంకు ఎనిమిదేళ్లలో పూర్తి రుణాన్ని తిరిగి చెల్లించే సౌకర్యాన్ని అందిస్తోంది. మీరు వీలైనంత త్వరగా EMI చెల్లిస్తే రుణంపై వడ్డీని ఆదా చేసుకునే సౌకర్యాన్ని కల్పించింది. ఎనిమిదేళ్ల లోపు మీరు మొత్తం బ్యాంకు రుణాన్ని తిరిగి చెల్లించవచ్చు.
రుణం కోసం షరతులు
SBI నుంచి ఎలక్ట్రిక్ వెహికల్ లోన్ పొందడానికి రుణగ్రహీత వయస్సు కనీసం 21 నుంచి గరిష్టంగా 67 సంవత్సరాలు ఉండాలి. వ్యాపారం, ప్రభుత్వ ఉద్యోగులు లేదా ప్రైవేట్ రంగంలో పనిచేసే ఉద్యోగులకు ఎస్‌బిఐ ఈ రుణాన్ని అందిస్తోంది. ఒక్కమాటలో చెప్పాలంటే మీ జీతం బ్యాంకు నిబంధనలకు అనుగుణంగా ఉంటేనే మీరు రుణం పొందవచ్చు. రూ.3 లక్షల కంటే ఎక్కువ వార్షిక ఆదాయం ఉన్న ఉద్యోగులు ఈ పథకం ప్రయోజనాలను పొందవచ్చు. మీరు ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనుగోలు చేయడానికి బ్యాంకుకు అవసరమైన పత్రాలను పూర్తి చేసిన తర్వాత రుణం మంజూరవుతుంది.