- Telugu News Photo Gallery Cricket photos IPL 2022: Sunrisers Hyderabad pace bowler Umarn malik Fastest bowler of league, win 5 award for his speed
IPL 2022: స్టార్ బ్యాటర్లకే చుక్కలు చూపించిన హైదరాబాద్ బౌలర్.. బుల్లెట్ల లాంటి బంతులతో రికార్డులన్నీ మటాష్
ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్ స్పీడ్ బ్యాట్స్‌మెన్స్‌తోపాటు ప్రేక్షకులకు కూడా ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. ఈ స్పీడ్‌తో మాలిక్ నిరంతరం వార్తల్లో నిలుస్తున్నాయి. ఐపీఎల్‌లోనూ హై స్పీడ్ బౌలింగ్‌తో మరోసారి..
Updated on: Apr 16, 2022 | 11:03 AM

IPL 2022లో స్పీడ్ ప్రస్తుతం ఉమ్రాన్ మాలిక్‌కు స్పెషల్ గుర్తింపుగా మారింది. జమ్మూలో పండ్లు, కూరగాయలు అమ్మే వ్యక్తి కొడుకు ఐపీఎల్ పిచ్‌పై సంచలనం సృష్టిస్తున్నాడు. తన హై స్పీడ్ బౌలింగ్‌తో అటు బ్యాటర్లను, ఇటు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లోనూ ఇదే కనిపిస్తోంది.

6 ఏళ్ల క్రితమే లెదర్ బాల్‌తో బౌలింగ్ చేయడం ప్రారంభించిన ఉమ్రాన్ మాలిక్.. ప్రస్తుతం భారత క్రికెట్‌లో కొత్త మాస్టర్ ఆఫ్ పేస్‌గా మారిపోయాడు. తండ్రి అబ్దుల్ రషీద్‌కు పండ్లు, కూరగాయల దుకాణం ఉంది. అందుకే అతని బాల్యం పేదరికంలో గడిచింది. కానీ ఇప్పుడు ఆర్థిక పరిస్థితి కూడా తన వేగం ఆధారంగా మెరుగుపడింది. ఐపీఎల్‌లో ఉమ్రాన్ వేగంగా బంతి విసురుతూ లక్షలు సంపాదిస్తున్నాడు.

ఉమ్రాన్ మాలిక్ IPL 2021 సమయంలో వెలుగులోకి వచ్చాడు. IPL 2022లో ఇప్పటివరకు వరుసగా 5 వేగవంతమైన బంతులు విసిరినందుకుగాను అవార్డులు గెలుచుకున్నాడు. వీటిలో గంటకు 153.3 కిలోమీటర్ల వేగంతో అత్యంత వేగంగా బంతిని విసిరిన రికార్డు కూడా ఉంది.

IPL 2022లో, మిగిలిన బౌలర్లు 140-145 KM/H వేగంతో బౌలింగ్ చేస్తున్నారు. అదే సమయంలో, ఉమ్రాన్ ఇప్పటివరకు 58 బంతులు చేసంధించాడు. దీని వేగం గంటకు 145 కిమీ కంటే ఎక్కువగా ఉంది. ఈ విషయంలో ఉమ్రాన్ దరిదాపుల్లో ఎవరూ లేరు.

సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడుతున్న మరో బౌలర్.. లాకీ ఫెర్గూసన్ గంటకు 145 కిమీ కంటే ఎక్కువ వేగంతో 30 బంతులు విసిరాడు. ఉమ్రాన్, ఫెర్గూసన్ తర్వాత, కుల్దీప్ సేన్ 9, సిరాజ్ 4, ప్రసిద్ధ్ కృష్ణ 3 ఈ లిస్టులో చేరాయి.




