Artificial Bird: ఇది పక్షి కాదండి బాబు.. పక్షిలాంటిది.. క్రియేటివిటీ అదిరిందికదూ..!

Artificial Bird: ఇది పక్షి కాదండి బాబు.. పక్షిలాంటిది.. క్రియేటివిటీ అదిరిందికదూ..!

Anil kumar poka

|

Updated on: Apr 18, 2022 | 9:51 AM

సోషల్‌ మీడియా ప్రపంచంలో ప్రతిరోజూ ఎన్నో వైరల్‌ వీడియోలు మనం చూస్తుంటాం. అవి మనకి వినోదాన్నే కాదు.. విజ్ఞానాన్ని కూడా పంచుతాయి. ఇలాంటి వీడియోలతో కొందరిలో దాగున్న టాలెంట్ కూడా బయటకు వస్తుంది. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది.


సోషల్‌ మీడియా ప్రపంచంలో ప్రతిరోజూ ఎన్నో వైరల్‌ వీడియోలు మనం చూస్తుంటాం. అవి మనకి వినోదాన్నే కాదు.. విజ్ఞానాన్ని కూడా పంచుతాయి. ఇలాంటి వీడియోలతో కొందరిలో దాగున్న టాలెంట్ కూడా బయటకు వస్తుంది. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఇద్దరు వ్యక్తులు ఒక భారీ పక్షిని ఎగరేస్తున్నారు. అదేంటి.. పక్షిని వ్యక్తులు ఎగరేయడమేంటి అనుకుంటున్నారుకదా… అవును.. అది నిజమైన పక్షి కాదు. బొమ్మ పక్షి.. కాగితంతో తయారు చేసిన పక్షి. నెమలిలా పెద్ద తోకతో… పొడవైన రెక్కలతో అచ్చం నిజమైన పక్షిలా ఆకాశంలో విహరిస్తూ సందడి చేసింది. ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూస్తున్న నెటిజన్లు భారీ ఆకారంతో ఉన్న ఈ నిర్జీవ పక్షి గాల్లో ఎలా ఎగరగలిగింది అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియోను ఓ ఖాతాదారు ట్విట్టర్‌లో షేర్ చేశారు. దీనిని వేలమంది వీక్షించగా.. వందలాది మంది ఈ వీడియోను రీట్వీట్ చేస్తున్నారు. ఈ వీడియోపై పలు కామెంట్లు చేస్తున్నారు. ఈ దృశ్యం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తోందంటున్నారు. ఈ పక్షి విమానంలా ఉందని.. అద్భుతం అంటూ ఓ నెటిజన్ అభిప్రాయపడితే.. ఈ పక్షి లోపల ఏదైనా యంత్రం ఉంండిఉంటుందని మరొకరు అభిప్రాయపడ్డారు. మరి ఆ వీడియోను మీరూ ఓసారి చూసేయండి.

మరిన్ని చూడండి ఇక్కడ:
Elephant-Lion: అః.. కుక్క మొరిగితే కొండకు సేట.. ఏనుగుపై సింహం దాడి.. కట్‌చేస్తే.. సీన్‌ రివర్స్‌

kacha badam Singer: తత్వం బోధపడింది.. నేనేంటో తెలిసొచ్చింది.. కచ్చా బాదామ్‌ సింగర్‌ మాటలు వింటే షాక్…

Viral Video: అవ్వ..! పెళ్లిలో వరుడి స్నేహితుడి నిర్వాకం.. ఏం చేస్తున్నాడో మీరే చూడండి..

Viral Video: వారేవా ఇది కదరా స్నేహమంటే.. దివ్యాంగుడిని భుజాలపై తిప్పిన గర్ల్స్‌.. వైరల్ వీడియో

Shashi Tharoor-Supriya Sule: నిండు సభలో సుప్రియతో అదేం పని శశిథరూర్‌.! వీడియో చుస్తే ఫ్యూజులు ఔట్ అంతే..

Ram Charan-Urfi Javed: రామ్ చరణ్ కు పడిపోయిన.. బాలీవుడ్ శృంగార తార.. ఓపెన్ ఆఫర్ అంటూ ఇలా..

Viral Video: మరికొద్ది క్షణాల్లో పెళ్లి.. మండపంలోకి మాజీ ప్రియుడి ఎంట్రీతో సీన్ రివర్స్..