Viral Video: చేప కోసం గాలం వేశాడు.. చిక్కింది చూసి స్టన్ అయ్యాడు

సాధారణంగా సముద్రంలో వేటకు వెళ్లేవారికి చేపలు చిక్కడం సహజం. ఒక్కోసారి వింత వింత చేపలు, రకరకాల రూపాల్లో మత్స్యకారుల వలకు చిక్కుతుంటాయి. తాజాగా అలాంటి ఘటనే జరిగింది.

Viral Video: చేప కోసం గాలం వేశాడు.. చిక్కింది చూసి స్టన్ అయ్యాడు
Viral Video
Follow us
Ram Naramaneni

|

Updated on: Apr 18, 2022 | 10:17 AM

Trending Video: చేపల కోసం ఓ వ్యక్తి  గాలం విసిరాడు. ఏదో చిక్కినట్లు అనిపించింది. బలంగా అనిపించడంతో… భారీ చేప చిక్కిందోమోనని సంబరపడిపోయాడు. అయితే గాలం బయటకు లాగితే షాక్‌కు గురయ్యాడు. అతను అనుకున్నట్లే భారీ చేప ఉంది. దాన్ని నోట పట్టి ఓ పెద్ద పాము కూడా కనిపించింది. దీంతో ఆ దృశ్యాన్ని చూసి అతడు కంగుతిన్నాడు.  వివరాల్లోకి వెళ్తే.. వేసవి కాలంలో అమెరికా(America)లోని లూసియానా, హ్యూస్టన్ ప్రాంతాల నివాసితులు చేపలు పట్టేందుకు వెళ్తారు. అలా వెళ్లి సముద్ర తీరాల్లో సేదతీరతారు. ఈ క్రమంలోనే ఒక టెక్సాస్ వ్యక్తి చేపల వేటకు వెళ్లాడు. ఎరను పెట్టి గాలం వేశాడు. కాసేపటికి గాలానికి ఏదో చిక్కిన్నట్లు అనిపించడంతో.. ఫిషింగ్ రాడ్‌ పైకి లాగగా.. పెద్ద చేపను పట్టిన కొండచిలువ చిక్కింది.  వైరల్‌గా మారిన 18 సెకన్ల క్లిప్‌లో చేపను పాము గట్టిగా చుట్టుకుని.. నోట కరవడం చూడవచ్చు. ఈ వీడియో పాతదే అయినప్పటికీ.. మరోసారి నెట్టింట వైరల్‌గా మారింది. కాగా ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. చేపల కోసం వల వేస్తే.. కొండ చిలువలు, మొసళ్లు, పాములు వంటి జీవులు చిక్కిన దాఖలాలు ఉన్నాయి. కానీ ఈ తరహా ఇన్సిడెంట్ మాత్రం చాలా అరుదనే చెప్పాలి.

Also Read: Viral Photo: ఇతను కళ్లతో మాయ చేస్తాడు.. మాటలతో బూరెలు వండేస్తాడు… ఎవరో గుర్తించారా..?