Telangana: చిల్లరగాళ్లు.. చిరు వ్యాపారులను కూడా వదలడం లేదు…
దొంగనోట్ల ముఠా తెలంగాణలో రెచ్చిపోతుంది. అమాయక మహిళలు, వృద్ధులను వారు టార్గెట్ చేస్తున్నారు. మాయ చేసి.. నోట్లను సర్కులేట్ చేస్తున్నారు.
తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా( mahabubnagar district) జడ్చర్ల(Jadcherla)లో దొంగ నోట్ల చలామణి కలవరపెడుతోంది. కొందరు కేటుగాళ్లు గల్లీలో ఉండే చిరు వ్యాపారులను టార్గెట్ చేసి అక్కడ సరుకులను కొనుగోలు చేసి నకిలీ కరెన్సీ(fake Indian currency)ని అంటగడుతున్నారు ముఖ్యంగా మహిళలు, వృద్ధులు ఉన్న కిరాణా షాప్ లను లక్ష్యంగా చేసుకుని నకిలీ కరెన్సీని చలామణి చేస్తున్నాను. చిరు వ్యాపారులను మాయ చేసి బురిడీ కొట్టిస్తున్నారు. తాజాగా జడ్చర్ల హౌసింగ్ బోర్డు కాలనీలో ఒక చిన్న కిరాణా షాపులో హెల్మెట్ ధరించిన యువకుడు వచ్చి 700 రూపాయల సరుకులు తీసుకుని హడావిడిగా నకిలీ వంద రూపాయల కరెన్సీ నోట్లు ఇచ్చి వెళ్ళాడు. అయితే ఆ తర్వాత చూస్తే అవి ఫేక్ కరెన్సీ అని తేలింది. దీంతో ఇప్పుడు ఆ షాపు యజమానులు లబోదిబోమంటున్నారు. తాము రోజంతా కష్టపడితే కూలి మందం డబ్బులు మిగులుతాయని.. తమ లాంటి బడుగు జీవులను కూడా ముంచేస్తున్న ఇలాంటి నకిలీగాళ్ల పని పట్టాలని బాధితులు పోలీసులను కోరుతున్నారు.
Also Read: Kadapa: షాకింగ్ ఇన్సిడెంట్.. ఛార్జింగ్ పెట్టి వర్క్ చేస్తుండగా ల్యాప్‌టాప్ బ్లాస్ట్.. పాపం యువతి
Viral Video: చేప కోసం గాలం వేశాడు.. చిక్కింది చూసి స్టన్ అయ్యాడు