Telangana: కులం కోసం ప్రాణాలు తీస్తున్నారు.. పరువు హత్యలకు కేరాఫ్ అడ్రస్‌గా భువనగిరి..
Bhuvanagiri Honor killings: కులాల గొడలు బద్ధలవుతున్నా.. కొందరు అవే కులాల కోసం కన్న పేగులను తెంచేస్తునారు.. సొంత వారి సంతోషాల కంటే కులం పౌరుషమే తమకు ప్రాణం ఆన్న రీతిలో ప్రవర్తిస్తున్నారు కొందరు తల్లిదండ్రులు..
Bhuvanagiri Honor killings: కులాల గొడలు బద్ధలవుతున్నా.. కొందరు అవే కులాల కోసం కన్న పేగులను తెంచేస్తునారు.. సొంత వారి సంతోషాల కంటే కులం పౌరుషమే తమకు ప్రాణం ఆన్న రీతిలో ప్రవర్తిస్తున్నారు కొందరు తల్లిదండ్రులు.. ప్రేమ కంటే కులమే గొప్పది అని భావించే తల్లిదండ్రులు ఒక వైపు.. కన్న వారి సంతోషం, కులం కన్నా తమ ప్రేమే గొప్పది అని భావించే తత్వం మరో వైపు.. ఇరువురి మధ్య అమాయకుల ప్రాణాలు కులం పేరుతో చిద్రమైపోతున్నాయి.. ఒకే జిల్లాలో ఎందుకీ దారుణాలు.. అంటే అక్కడి జీవితాలు ఇంకా అనాగరికతలోనే బతుకుతున్నాయి.. ప్రేమతో బతకడం కంటే కులంతోనే బతుకుతున్న భువనగిరిలోనే పరువు హత్యలు ఎక్కువ జరగడంపై పలువురు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. దిన దినానా మానవుడు అభివృద్ధి చెందుతున్న కొన్నింటిలో మాత్రం దినదినానా దిగ జారిపోతునే ఉన్నాడు.. సమాజంలో కులాల అడ్డుగోడలు కూలిపోతున్నా అక్కడక్కడ పరువు హత్యలు ఆందోళన కలిగిస్తూనే ఉన్నాయి. భువనగిరి గడ్డపై సంచలనలకు కేంద్రంగా మారాయి పరువు హాత్యలు.. కులాల పట్టింపులు, పరువు పోయిందనే కారణంగా ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నవారి ప్రాణాలు తీయడానికి తెగబడుతున్నారు. 2017 లో మే 16న ఇదే భువనగిరి జిల్లాలో ప్రేమపెళ్లి చేసుకున్న నరేష్ అనే యువకుడిని యువతి తండ్రి హతమార్చాడు. 2018 సెప్టెంబరు 14న నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ప్రణయ్‌ను అమృత తండ్రి మారుతీరావు హత్య చేయించడం అప్పట్లో సంచలనం రేకెత్తించింది. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లాకేంద్రంలో రామకృష్ణ హత్య కలకలం రేపుతుంది.
ప్రేమించి.. పెళ్లి చేసుకున్నాడని రామకృష్ణను హత్య చేయించారు.. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం లింగరాజుపల్లికి చెందిన ఎరుకల రామచంద్రు, కళమ్మ దంపతుల కుమారుడు రామకృష్ణ (35)ను తనమామ వెంకటేశ్ హత్య చేయించిన ఘటన ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. తన కుమార్తెను పెళ్లి చేసుకున్నాడనే నెపంతో 10లక్షల సుపారీ ఇచ్చి రామకృష్ణగౌడ్‌ను హత్య చేయించాడు. లింగరాజుపల్లి చెందిన రామకృష్ణగౌడ్ 2015 నుంచి 2019 వరకు వలిగొండ, యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్‌లో హోంగార్డుగా పనిచేశాడు. అదే సమయంలో యాదగిరిగుట్టలో అతను అద్దెకుంటున్న గదికి ఎదురుగా మరో ఇంట్లో యాదగిరిగుట్ట మండలం గౌరాయిపల్లికి చెందిన వీఆర్వో పల్లెర్ల వెంకటేశం కుటుంబం నివసించేది. ఈ క్రమంలో వెంకటేశం కుమార్తె భార్గవి, రామకృష్ణ ప్రేమలో పడ్డారు. ఇరువురిది బీసీకే చెందిన వేర్వేరు సామాజిక వర్గాలు కావడంతో భార్గవి తండ్రి వెంకటేశం ఇరువురి ప్రేమను వ్యతిరేకిస్తూ వెంకటేశంపై కక్ష పెంచుకున్నాడు. అయితే.. వీరిద్దరూ 2020, ఆగస్టు 16వ తేదీన హైదరాబాద్‌లోని ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకున్నారు. అప్పటికే ఇరువురి మధ్య ప్రేమను విచ్చిన్నం చేసేందుకు పలు ప్రయత్నాలు చేసినప్పటికీ భార్గవి, రామకృష్ణ వివాహం చేసుకోవడంతో వారిద్దరిపై వెంకటేశం మరింత కక్ష పెంచుకున్నాడు.
ఎలాగైనా వారి జీవితాన్ని విడగొట్టి బిడ్డను ఇంటికి తెచ్చుకోవాలనే ప్రయత్నాలు మొండిగా సాగించాడు. దీంతో వెంకటేశం ప్రవర్తనపై అనుమానం తలెత్తిన ఆ దంపతులు అతని భారీ నుంచి తప్పించుకునేందుకు రహస్యంగా పలు ప్రాంతాల్లో నివాసం ఉన్నప్పటికీ వారినే వెంటాడుతూ మిర్యాలగూడ, ఉప్పల్ నుంచి రెండు సార్లు బలవంతంగా తన కుమార్తె భార్గవిని ఇంటికి తీసుకెళ్లాడు. దీంతో ఆమె తండ్రిపై అప్పట్లో యాదగిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో అక్కడి పోలీసులు ఇరువురి మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నాలు చేసి వెంకటేశాన్ని హెచ్చరించి వదిలేశారు. అయితే గత ఏడాదిగా ఆ దంపతులు భువనగిరి తాతానగర్‌లో ఓ ఇంట్లో అద్దెకు ఉంటుండగా 6 నెలల క్రితం వీరికి కుమార్తె జన్మించింది. ఇప్పటికైనా తండ్రి తమను వదిలిపెడతాడని భార్గవి ఆశ పడింది. అయినా అల్లుడు రామకృష్ణను కిరాయి హంతకులతో దారుణంగా హత్య చేయించడంతో ఆకుటుంబం రోడ్డున పడినట్లయింది.
గతంలోనూ ఇదే భువనగిరిలో స్వాతి నరేష్ ప్రేమ వ్యవహారం నచ్చక.. నరేష్ ను అత్యంత కిరాతకంగా పెట్రోల్ పోసి తగలబెట్టి ఆనవాలు కూడా లభించకుండా చేశారు. ఆతరువాత ప్రణయ్ అమృతల ప్రేమ వ్యవహారంలో ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. కులాలు వేరు కావడంతో అమృత ప్రణయ్ ప్రేమకి ఒప్పుకొని మారుతీ రావు.. అందరూ చూస్తుండగానే పట్టపగలు నడిరోడ్డుపై అత్యంత కిరాతకంగా కిరాయి గూండాలతో ప్రణయ్ ను హత్య చేయించాడు. ఈ రెండు ఘటనలకు కేంద్రమైన అదే భువనగిరిలో ఇప్పుడు రామకృష్ణ హత్య సైతం సంచలనం రేపుతోంది.
Also Read: