TS Police jobs 2022: వారంలో తెలంగాణ పోలీస్ నోటిఫికేషన్ విడుదల.. మంత్రి హరీశ్ రావు వెల్లడి
తెలంగాణ రాష్ట్రంలో వారంలోగా పోలీస్ నోటిఫికేషన్ వెలువడనుందని ఆర్థిక, అరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు (Finance Minister Harish Rao) సోమవారం (ఏప్రిల్ 18) వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని శాఖలోని..
Telangana Police Notification issue date 2022: తెలంగాణ రాష్ట్రంలో వారంలోగా పోలీస్ నోటిఫికేషన్ వెలువడనుందని ఆర్థిక, అరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు (Finance Minister Harish Rao) సోమవారం (ఏప్రిల్ 18) వెల్లడించారు. కాగా నేడు సంగారెడ్డి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పటాన్‌చెరు ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగ అభ్యర్థులకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సహకారంతో ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులను మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వారంలో నోటిఫికేషన్ వెలువడుతుందని, కష్టపడి చదివి ఉద్యోగాలను సంపాదించుకోవాలన్నారు. రాష్ట్రంలోని అన్ని శాఖలోన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నాం.. విద్యార్థుల కోరిక మేరకు పోలీస్ ఉద్యోగాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ 3 ఏళ్ల వయోపరిమితి పెంచారు. 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా చేశారు. పోలీసు ఉద్యోగాల్లో మహిళలకు 30 శాతం కల్పించడమేనేది దేశంలో ఎక్కడా లేదు.. ఫైర్, ఫారెస్ట్, ఎక్సయిజ్, పోలీసు శాఖలతో సహా 20 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఈ ఏడాది మొత్తం 91 వేల ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నాం. కేంద్రం విడుదల చేయనున్న ఉద్యోగాలకు కూడా ఈ ప్రిపరేషన్ ఉపయోగపడుతుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత లక్షా 32 వేల పోస్టులు భర్తీ చేశాం. ప్రస్తుతం భర్తీకానున్న ఉద్యోగాలతో కలిపి మొత్తం 2 లక్షలకు పైగా ఉద్యోగాలు నింపినట్టవుతుందన్నారు. వచ్చే ఏడాది నుంచి జాబ్ క్యాలెండర్ సిద్దం చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి వెల్లడించారు. మంత్రి ఇంకా మాట్లాడుతూ..
మోకాళ్ళ యాత్ర, పాద యాత్ర చేయడం కాదు.. కేంద్రంలో 15 లక్షలకు పైగా పోస్టులు (Central job Vacancies) ఖాళీగా ఉన్నాయి. ఈ ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలని, తెలంగాణకు ఇతర రాష్ట్రాల వారు వచ్చి ఉద్యోగాలు చేస్తున్నారు. బీజేసీ పాలిత రాష్ట్రాల్లో పరిస్థితులు బాగుంటే ఇక్కడికి ఉపాధి, ఉద్యోగం కోసం ఎందుకు వస్తారని మంత్రి హరీష్ రావు ఎద్దేవాచేశారు. ధరలు పెంచినందుకు, ఉద్యోగాలు ఇవ్వనందుకు, ప్రజల జీవితాలను ఆగం చేస్తున్నందుకు యాత్ర చేస్తున్నారా..? ఏం ముఖం పెట్టుకొని తిరుగుతున్నారు. కుల, మతాల మధ్య చిచ్చు పెట్టి బీజేపీ లబ్ధి పొందాలని చూస్తోందని, ఉద్యోగాల భర్తీ గురించి తెలంగాణ విద్యార్థులు ఎక్కడికక్కడ బీజీపీని నిలదీయండని మంత్రి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
Also Read: