AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: తూర్పు గోదావరిలో ఘోరం.. బాలికపై గ్రామ వాలంటీర్ అత్యాచారం..

Village Volunteer Rapes Minor Girl: ఆంధ్రప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ గ్రామ వాలంటీర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన తూర్పుగోదావరి జిల్లా సీతానగరం

Andhra Pradesh: తూర్పు గోదావరిలో ఘోరం.. బాలికపై గ్రామ వాలంటీర్ అత్యాచారం..
rape case
Shaik Madar Saheb
|

Updated on: Apr 18, 2022 | 9:31 AM

Share

Village Volunteer Rapes Minor Girl: ఆంధ్రప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ గ్రామ వాలంటీర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం బొబ్బిల్లంక గ్రామంలో వెలుగు చూసింది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. సీతానగరం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. (East Godavari) బొబ్బిల్లంక గ్రామ వాలంటీర్‌గా పనిచేస్తున్న బూసి సతీష్ (23) అనే యువకుడు అదే గ్రామానికి చెందిన బాలికతో పరిచయం పెంచుకున్నాడు. ప్రభుత్వ పథకాల పేరుతో సతీష్ తరచూ బాలిక ఇంటికి వెళ్లేవాడు. ఈ క్రమంలో తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో ఇంటికి వెళ్లిన సతీష్.. ఒంటరిగా ఉన్న బాలికపై అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని.. చెబితే చంపుతానంటూ బెదిరించడంతో బాలిక ఇంట్లో చెప్పలేదు.

అత్యాచారం నాటినుంచి బాలిక ప్రవర్తనలో మార్పు గమనించిన తల్లిదండ్రులు.. ఆమెను ప్రశ్నించారు. దీంతో అసలు విషయం బయటకు వచ్చింది. గ్రామ వాలంటీర్ సతీష్ అత్యాచారానికి పాల్పడినట్టు బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో వారు సీతానగరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాలంటీర్ సతీష్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి.. వైద్య పరీక్షల నిమిత్తం బాలికను రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు పోలీసుల వెల్లడించారు. నిందితుడు సతీష్‌ను అరెస్ట్ చేసి విచారిస్తున్నామని.. ఎస్ఐ తెలిపారు. కాగా.. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

Also Read:

Vishwa Deenadayalan: రోడ్డు ప్రమాదంలో యువ క్రీడాకారుడు విశ్వ మృతి.. టోర్నీ కోసం వెళ్తుండగా..

Covid-19: కరోనా వచ్చినప్పుడు వాసన కోల్పోయారా.. వాటి డ్యామేజ్ వల్లేనేనంటున్న పరిశోధనలు..