Kadapa: షాకింగ్ ఇన్సిడెంట్.. ఛార్జింగ్ పెట్టి వర్క్ చేస్తుండగా ల్యాప్‌టాప్ బ్లాస్ట్‌.. పాపం యువతి

ఛార్జింగ్ పెట్టి ఫోన్లు, ల్యాప్‌టాప్స్ వినియోగింగేవారికి ఇదొక హెచ్చరిక. అలా చేసే ఓ యువతి ఇప్పుడు మృత్యువుతో పోరాడుతుంది. కడప జిల్లాలో ఈ షాకింగ్ ఇన్సిడెంట్ వెలుగుచూసింది.

Kadapa: షాకింగ్ ఇన్సిడెంట్.. ఛార్జింగ్ పెట్టి వర్క్ చేస్తుండగా ల్యాప్‌టాప్ బ్లాస్ట్‌.. పాపం యువతి
representative picture
Follow us
Ram Naramaneni

|

Updated on: Apr 18, 2022 | 12:42 PM

Andhra Pradesh: ఏపీలో షాకింగ్ ఇన్సిడెంట్ వెలుగుచూసింది. విద్యుత్ షాట్ సర్క్యూట్‌తో ల్యాప్‌టాప్‌ పేలిపోయింది. ఈ ఘటనలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగినికి గాయాలయ్యాయి. కడపజిల్లా బి.కోడూరు మండలంలోని మేకవారిపల్లె(Mekavaripalli)లో జరిగిందీ ఘటన. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న సుమలత.. ల్యాప్‌టాప్ చార్జింగ్ పెట్టి ఇంటి నుంచి ఆఫీస్ వర్క్ చేస్తోంంది. ఈ క్రమంలోనే ఒక్కసారిగా ల్యాప్‌టాప్ బ్లాస్ట్‌ అయింది. సుమలత ఒళ్లంతా బొబ్బలెక్కి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే ఆమెను కడప ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో ఆమె బెడ్‌పై ఉండటంతో.. బెడ్‌తో పాటు బెడ్‌షీట్‌ అంతా కాలిపోయింది. ఇంట్లో కూడా చాలా వరకు మంటలు వ్యాపించినట్లు అక్కడి పరిస్థితిని బట్టి తెలుస్తుంది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. యువతికి గాయాలైన విజువల్స్ దారుణంగా ఉన్నాయి. అవి కొందర్ని కలిచివేసే అవకాశం ఉన్నందున అందుబాటులో ఉంచడం లేదు. ఛార్జింగ్ పెట్టి ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్స్ ఉపయోగించేవారికి ఇదొక హెచ్చరిక. బీ కేర్‌ఫుల్.

Also Read: Viral Video: చేప కోసం గాలం వేశాడు.. చిక్కింది చూసి స్టన్ అయ్యాడు