Andhra: ఏపీలో అన్ని చోట్లా ఆర్టీసీ ఛార్జీలు పెరిగితే.. అక్కడ మాత్రం రూ.10 తగ్గాయి.. ట్విస్ట్ ఏంటంటే..?

ఏపీలోని అన్ని ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సల్లో టికెట్ ఛార్జీలు పెరిగితే.. అక్కడ మాత్రం తగ్గాయి. ఇందుకు పెద్ద కారణమే ఉంది.. ఆ వివరాలు మీ కోసం....

Andhra: ఏపీలో అన్ని చోట్లా ఆర్టీసీ ఛార్జీలు పెరిగితే.. అక్కడ మాత్రం రూ.10 తగ్గాయి.. ట్విస్ట్ ఏంటంటే..?
Apsrtc
Follow us
Ram Naramaneni

|

Updated on: Apr 18, 2022 | 11:04 AM

ఏపీలో డీజిల్ సెస్ పేరుతో ఆర్టీసీ టికెట్ ధరలు పెంచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి. అయితే అన్ని చోట్ల బస్సు ఛార్జీలు పెరగాయి.. కానీ ఒక మార్గంలో మాత్రం తగ్గాయి. విచిత్రంగా అనిపించినా.. పూర్తి నిజం. ఈ క్రమంలోనే ఇన్నాళ్లు పాసింజర్స్ నుంచి వేసిన అదనపు వాయింపు విషయం కూడా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే..  పాడేరు(Paderu)డిపో నుంచి చోడవరం(Chodavaram) వరకు గతంలో 67 కిలోమీటర్ల దూరం చూపించి, రూ.80 టికెట్ కొట్టేవారు. కాగా ఆర్టీసీ యాజమాన్యం ఇటీవల డీజిల్ సెస్ వేయడంతో.. టికెట్ ధరను రూ.85కు పెంచారు. అయితే అనూహ్యంగా 2 రోజుల్లోనే  టికెట్‌పై ఉన్న దూరాన్ని 67 కి.మీ నుంచి 56 కిలోమీటర్లకు తగ్గించారు. ఛార్జీ కూడా రూ.85 నుంచి రూ.75కు తగ్గించారు. దీనిపై అల్లాడ శ్రీనివాసరావు అనే వ్యక్తి గళమెత్తారు. డిపో యాజమాన్యాన్ని స్టైయిట్‌గా ప్రశ్నించారు. దీంతో అధికారులు ఈ ఇష్యూపై వివరణ ఇచ్చారు.

గతంలో పాడేరు నుంచి వి.మాడుగుల మీదుగా చోడవరానికి బస్సులు నడిచేవని.. ఈ దూరాన్ని బట్టి రూ.80 టికెట్‌ వసూలు చేసినట్లు తెలిపారు. అయితే గత 10 ఏళ్లగా వి.మాడుగుల వెళ్లకుండానే ఘాట్‌రోడ్డు మీదుగా బస్సుల చోడవరం వెళ్తున్నాయి. అయినా అదే టికెట్ రేటు వసూలు చేశారు.  తాజాగా మారిన దూరానికి అనుగుణంగా ఛార్జీ తగ్గించారు. బస్సుల రూట్‌ మారిన విషయాన్ని ఆర్టీసీ లెక్కలోకి తీసుకోకుండా ఇన్నాళ్లుగా పాత ఛార్జీలే కొనసాగించడంపై పాసింజర్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త మార్గాలు అందుబాటులోకి వచ్చి దూరాలు తగ్గినప్పుడు, ఆ మేరకు ఛార్జీలు సర్దుబాటు చేయకుండా ప్రయాణికుల నుంచి అదనంగా వసూలు చేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Also Read: Viral Video: చేప కోసం గాలం వేశాడు.. చిక్కింది చూసి స్టన్ అయ్యాడు