AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: మంత్రి ఉష శ్రీచరణ్ కు వింత అనుభవం.. పూజలు చేస్తుండగా ఒడిలో కూర్చున్న వానరం

ఇటీవల సీఎం జగన్‌(CM Jagan) చేపట్టిన కేబినెట్‌ పునర్వ్యవస్థీకరణలో భాగంగా పలువురు కొత్తవారికి మంత్రి పదవులు కేటాయించారు. అనంతపురం జిల్లా కల్యాణదుర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఉష శ్రీచరణ్(Usha Sricharan) కు మంత్రి పదవి వరించింది. ఆమెను...

AP News: మంత్రి ఉష శ్రీచరణ్ కు వింత అనుభవం.. పూజలు చేస్తుండగా ఒడిలో కూర్చున్న వానరం
Usha Sri
Ganesh Mudavath
|

Updated on: Apr 18, 2022 | 6:08 PM

Share

ఇటీవల సీఎం జగన్‌(CM Jagan) చేపట్టిన కేబినెట్‌ పునర్వ్యవస్థీకరణలో భాగంగా పలువురు కొత్తవారికి మంత్రి పదవులు కేటాయించారు. అనంతపురం జిల్లా కల్యాణదుర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఉష శ్రీచరణ్(Usha Sricharan) కు మంత్రి పదవి వరించింది. ఆమెను స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ క్రమంలో మంత్రి హోదాలో కసాపురం(Kasapuram) ఆంజనేయ స్వామిని దర్శించుకునేందుకు ఆమె ఆలయానికి వెళ్లారు. అదే సమయంలో మంత్రికి వింత అనుభవం ఏర్పడింది. మంత్రి దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తుండగా ఓ వానరం వచ్చి, మంత్రి ఒడిలో కూర్చుంది. కోతిని తరిమేందుకు ప్రయత్నించినా అది అక్కడి నుంచి కదలకపోవడం విశేషం. ఆంజనేయ స్వామి ఆలయంలో ఈ ఘటన జరగడంపై స్థానికులు, అక్కడ ఉన్న వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇది సాక్షాత్తూ ఆంజనేయ స్వామి వరమేనని మంత్రి అన్నారు. స్వామి ఆశీస్సులతో ప్రజలకు మెరుగైన సేవ చేస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు.

మంత్రిగా బాధ్యతలు తీసుకొని తొలిసారి కల్యాణదుర్గం నియోజకవర్గానికి వస్తున్న మంత్రి ఉష శ్రీచరణ్ ఊరేగింపు సందర్భంగా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వాహనాలను నిలిపివేశారు. అదే సమయంలో శెట్టూరు మండలం చెర్లోపల్లికి చెందిన ఈరక్క, గణేష్​ల కూతురు పండు అనే 8 నెలల చిన్నారిని ఆస్పత్రికి తీసుకెళ్తుండగా ఆ వాహనం ట్రాఫిక్​లో నిలిచిపోయింది. ముందుకు వెళ్లేందుకు మరో మార్గం లేకపోవటంతో ఆ చిన్నారి మృతి చెందింది.

ఈ ఘటనపై మంత్రి ఉషా శ్రీ చరణ్ స్పందించారు. చిన్నారి మృతిపై తెదేపా నేలు శవ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. తన పర్యటనకు వచ్చిన ఆదరణను చూడలేకే తమపై లేనిపోని అభాండాలు వేస్తున్నారని ధ్వజమెత్తారు. బాధిత కుటుంబసభ్యులు తన వల్ల నష్టం జరగలేదని చెప్పినా ప్రతిపక్షాలు బురద జల్లుతున్నాయని ఆక్షేపించారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలా న్యాయం చేస్తామని హామి ఇచ్చారు.

Also Read

Millets Benfits: ఎదిగే పిల్లలకు చిరు ధాన్యాలు బెస్ట్.. ఇందులో ఉండే పోషకాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..!

Amway: ఆమ్‌వే ఆస్తులను అటాచ్‌ చేసిన ఈడీ.. మోసానికి పాల్పడుతున్నట్లు గుర్తించిన దర్యాప్తు సంస్థ..

Nikhil: పాన్ ఇండియా మార్కెట్ పై కన్నెసిన యంగ్ హీరో.. నిఖిల్ కొత్త సినిమా టైటిల్ ఏంటో తెలుసా ?..