AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nikhil: పాన్ ఇండియా మార్కెట్ పై కన్నెసిన యంగ్ హీరో.. నిఖిల్ కొత్త సినిమా టైటిల్ ఏంటో తెలుసా ?..

ప్రస్తుతం దక్షిణాది చిత్రపరిశ్రమలో పాన్ ఇండియా టార్గెట్ నడుస్తోంది. ఇప్పటికే.. ప్రభాస్ , ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ కేవలం దక్షిణాదిలోనే కాకుండా..

Nikhil: పాన్ ఇండియా మార్కెట్ పై కన్నెసిన యంగ్ హీరో.. నిఖిల్ కొత్త సినిమా టైటిల్ ఏంటో తెలుసా ?..
Nikhil
Rajitha Chanti
|

Updated on: Apr 18, 2022 | 4:11 PM

Share

ప్రస్తుతం దక్షిణాది చిత్రపరిశ్రమలో పాన్ ఇండియా టార్గెట్ నడుస్తోంది. ఇప్పటికే.. ప్రభాస్ , ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ కేవలం దక్షిణాదిలోనే కాకుండా.. నార్త్‏లోనూ అదుర్స్ అనిపించుకున్నారు. ఇక కన్నడ స్టార్ హీరో యశ్.. కేజీఎఫ్ 2 మూవీతో మరోసారి ప్రపంచవ్యాప్తంగా రికార్డ్స్ సృష్టిస్తున్నాడు. దీంతో మిగతా స్టార్ హీరోస్ సైతం పాన్ ఇండియా మార్కెట్ పై కన్నెశారు. తాజాగా యంగ్ హీరో నిఖిల్ (Nikhil) తన పాన్ ఇండియా చిత్రాన్ని అనౌన్స్ చేశాడు. యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ప్రధానపాత్రలో.. గూడాచారి, ఎవరు, హిట్ లాంటి సూపర్ హిట్ చిత్రాల ఎడిటర్ గా చేసిన గ్యారీ బిహెచ్ దర్శకత్వంలో ఓ భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను ఎడ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పై చరణ్ తేజ్ ఉప్పలపాటి సిఈఓగా నిర్మాత కె. రాజ శేఖర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో నిఖిల్ పాత్రకు తగట్టు ‘స్పై ‘అని టైటిల్ ఖరారు చేసింది చిత్ర యూనిట్. తాజాగా టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్.

టైటిల్ పోస్టర్ డిజైన్ చాలా ఆసక్తికరంగా వుంది. గన్‌లు, బుల్లెట్‌లు, స్నిపర్ గన్ స్కోప్‌ తో పాటు టైటిల్ లెటర్ ని గన్ సేఫ్‏లో సాలిడ్‏గా డిజైన్ చేశారు. టైటిల్ పోస్టర్ లో నిఖిల్ లుక్ స్టన్నింగా వుంది. బ్లాక్ టీ-షర్ట్, బ్లాక్ జాకెట్, బ్లాక్ కార్గో ప్యాంట్, క్లాసిక్ ఏవియేటర్స్ ధరించి, చేతిలో గన్ తో సూపర్ స్టైలిష్‌ ‘స్పై’ గా కనిపించారు నిఖిల్. అందరి ద్రుష్టిని ఆకర్షించిన ఈ టైటిల్ పోస్టర్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. సరికొత్త గెటప్, పాత్రలో కనిపించనున్న ‘స్పై’ ని నిఖిల్ తొలి పాన్ ఇండియా చిత్రంగా నిర్మాతలు భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో 2022 దసరాకు ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం థియేటర్లలో సందడి చేయబోతుందని చిత్ర యూనిట్ ప్రకటించింది. పూర్తి యాక్షన్‌తో కూడిన స్పై థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో నిఖిల్ సరసన ఐశ్వర్యా మీనన్ కథానాయికగా నటిస్తోంది. ఈ హై బడ్జెట్ ఎంటర్‌టైనర్‌లో అత్యున్నత సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. హాలీవుడ్ టెక్నీషియన్ జూలియన్ ఎస్ట్రాడా ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ కాగా, ఓ హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ యాక్షన్ సీక్వెన్స్‌లను డిజైన్ చేశారు. శ్రీచరణ్ పాకాల ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఆర్ట్ డైరెక్టర్ గా అర్జున్ సూరిశెట్టి , ప్రొడక్షన్ డిజైనర్ గా రవి ఆంథోని పని చేస్తున్నారు.

Also Read: F3 Movie: ఎఫ్ 3 నుంచి సెకండ్ సింగిల్ వచ్చేది అప్పుడే.. ఆకట్టుకుంటున్న పోస్టర్..

Mahesh Babu: మహేష్ బాబు సినిమాలో ఆ బాలీవుడ్ స్టార్ హీరో.. మాటల మాంత్రికుడి మరో మ్యాజిక్..

Nani Ante Sundaraniki: అంటే సుందరానికి నుంచి స్పెషల్ అప్డేట్.. టీజర్ రిలీజ్ డేట్ చెప్పేసిన మేకర్స్..

Samantha: ఆ ఆలోచనే మానుకోండి.. నెటిజన్లకు ఊహించని షాకిచ్చిన సమంత..

Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..