AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

F3 Movie: ఎఫ్ 3 నుంచి సెకండ్ సింగిల్ వచ్చేది అప్పుడే.. ఆకట్టుకుంటున్న పోస్టర్..

డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) తెరకెక్కిస్తోన్న లేటేస్ట్ చిత్రం ఎఫ్ 3 (F3). ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై

F3 Movie: ఎఫ్ 3 నుంచి సెకండ్ సింగిల్ వచ్చేది అప్పుడే.. ఆకట్టుకుంటున్న పోస్టర్..
F3
Rajitha Chanti
|

Updated on: Apr 18, 2022 | 3:26 PM

Share

డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) తెరకెక్కిస్తోన్న లేటేస్ట్ చిత్రం ఎఫ్ 3 (F3). ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమాలో వెంకటేష్, వరుణ్ తేజ్, మిల్కీ బ్యూటీ తమన్నా, మెహ్రీన్ ఫిర్జాదా ప్రధాన పాత్రలలో నటిస్తోన్నారు. సూపర్ క్రేజీ మల్టీస్టారర్ ‘F3’ థీమ్ సాంగ్ చార్ట్ బస్టర్‏గా నిలిచింది. సినిమా ప్రధాన తారాగణం అంతా కనిపించిన ఈ పాట కోసం రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఎనర్జిటిక్ ట్యూన్ ని కంపోజ్ చేశారు. సినిమా మ్యూజికల్ ప్రమోషన్‌లలో భాగంగా ఏప్రిల్ 22న చిత్ర యూనిట్ సెకెండ్ సింగిల్ ‘వూ.. ఆ.. ఆహా.. ఆహా..ఆహా’ పాటని విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

ఈ సందర్భంగా విడుదల చేసిన సాంగ్ పోస్టర్‌లో ప్రధాన తారాగణం రోప్ పుల్లింగ్ ఆట ఆడుతూ కనిపించారు. ఒక వైపు, తమన్నా, మెహ్రీన్ సోనాల్ చౌహాన్ తాడును లాగుతుండగా మరోవైపు వరుణ్ తేజ్ ఒంటరిగా కష్టపడటం, వెంకటేష్ తన మార్క్ స్టయిల్ లో వరుణ్‏ని ప్రోత్సహించడం ఆకట్టుకుంది. వెంకటేష్, వరుణ్ తేజ్ కూల్‌గా కనిపిస్తుండగా, తమన్నా, మెహ్రీన్, సోనాల్ గ్లామర్‌గా కనిపిస్తున్నారు. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, సునీల్ ఈ చిత్రంలో ఇతర కీలక పాత్రలలో కనిపిస్తుండగా స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే పార్టీ సాంగ్‏లో సందడి చేయనుంది. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా తమ్మిరాజు ఎడిటర్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి హర్షిత్ రెడ్డి సహా నిర్మాత. ప్రేక్షకులకు నవ్వులు పంచడానికి మే 27న ఎఫ్ 3 ప్రపంచవ్యాప్తంగా భారీ విడుదలకు సిద్ధమైయింది.

Also Read: Shivani Rajasekhar: దేవకన్యలా మైమరిపిస్తున్న అందాల సుందరి ‘శివాని’ లేటెస్ట్ ఫొటోస్.

KGF 2 Collection: బ్రేకులు లేని బుల్డోజర్‌లా దూసుకుపోతున్న యశ్.. సునామీలా కలెక్షన్స్

Bharti Singh: పురిటి బిడ్డను చూసుకోకుండా అప్పుడే షూటింగ్‌కు వెళతావా? .. కామెడీ క్వీన్‌పై మండిపడుతున్న నెటిజన్లు..

Ghani Movie: విడుదలైన రెండు వారాలకే డిజిటల్‌ స్ర్కీన్‌పై గని.. ఆరోజు నుంచే ఓటీటీలో స్ట్రీమింగ్..