Ghani Movie: విడుదలైన రెండు వారాలకే డిజిటల్‌ స్ర్కీన్‌పై గని.. ఆరోజు నుంచే ఓటీటీలో స్ట్రీమింగ్..

Ghani Movie in OTT: మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ (VarjunTej) హీరోగా తెరకెక్కిన చిత్రం గని. బాలీవుడ్‌ బ్యూటీ సాయి మంజ్రేకర్‌ ఇందులో హీరోయిన్‌గా నటించగా.. కన్నడ స్టార్‌ ఉపేంద్ర, నదియా, సునీల్ శెట్టి, జగపతి బాబు, నదియా తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Ghani Movie: విడుదలైన రెండు వారాలకే డిజిటల్‌ స్ర్కీన్‌పై గని.. ఆరోజు నుంచే ఓటీటీలో స్ట్రీమింగ్..
Ghani Movie
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Apr 18, 2022 | 9:48 AM

Ghani Movie in OTT: మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ (VarjunTej) హీరోగా తెరకెక్కిన చిత్రం గని. బాలీవుడ్‌ బ్యూటీ సాయి మంజ్రేకర్‌ ఇందులో హీరోయిన్‌గా నటించగా.. కన్నడ స్టార్‌ ఉపేంద్ర, నదియా, సునీల్ శెట్టి, జగపతి బాబు, నదియా తదితరులు కీలక పాత్రలు పోషించారు. కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్‌ 8న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాగా బాక్సింగ్‌ ప్రధానాంశంగా తెరకెక్కిన ఈ స్టోర్ట్స్‌ యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌ బాక్సాఫీస్‌ వద్ద మిక్సడ్ టాక్‌ తెచ్చుకుంది. ఈక్రమంలో థియేటర్లలో విడుదలైన రెండు వారాలలోపే డిజిటల్‌ స్ర్కీన్‌పై అలరించేందుకు సిద్ధమవుతోంది గని (Ghani). ఈనెల 22 నుంచి ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆహాలో స్ట్రీమింగ్‌ అయ్యేందుకు రెడీ అవుతోంది. ‘కనీవిని ఎరుగని స్టైల్‌లో గని వస్తున్నాడు’ అంటూ తాజాగా ఈ విషయాన్ని ఆహా యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది.

రెండు వారాలకే.. సాధారణంగా సినిమా థియేటర్లలో విడుదలైన 4-5 వారాల తర్వాత డిజిటల్‌ లోకి వస్తుంది. అయితే ఇటీవల కొన్ని సినిమాలు మాత్రం 2-3 వారాల్లోపే ఓటీటీల్లోకి అడుగుపెడుతున్నాయి. గతంలో పాన్‌ ఇండియా స్థాయిలో బ్లాక్‌ బస్టర్‌ హిట్టైన బన్నీ సినిమా పుష్ప నెల రోజుల్లోనే స్మా్ర్ట్‌ స్ర్కీన్‌ పై దర్శనమిచ్చింది. ఆ తర్వాత వచ్చిన పవన్‌ కల్యాణ్‌ భీమ్లానాయక్‌, ప్రభాస్‌ రాధేశ్యామ్‌ కూడా తక్కువ రోజుల్లోనే డిజిటల్‌ స్ర్కీన్‌పై సందడి చేశాయి. ఇప్పుడు మెగా ప్రిన్స్‌ గని సినిమా కూడా థియేటర్లలో విడుదలైన రెండు వారాలకే ఆహాలో స్ట్రీమింగ్‌ కానుంది. కాగా అల్లు అరవింద్‌ సమర్పణలో అల్లు బాబీ, సిద్ధు ముద్ద నిర్మించిన గని సినిమాకు తమన్‌ స్వరాలు అందించారు. తమన్నా ఓ స్పెషల్‌ సాంగ్‌లో కనువిందు చేసింది. మరి ఈ మెగా మూవీని థియేటర్లలో చూడని వారు ఎంచక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్‌ చేయండి.

Also Read:Godavari Biorefineries IPO: రూ. 700 కోట్ల ఐపీవో లాంచ్ చేయనున్న కెమికల్స్ కంపెనీ.. ఇప్పటికే సెబీ నుంచి అనుమతి..

TS High Court Recruitment 2022: రూ.63 వేల జీతంతో.. తెలంగాణలో జిల్లా జడ్జి పోస్టులకు నోటిఫికేషన్‌..పూర్తి వివరాలు..

Governor Delhi Tour: మళ్లీ ఢిల్లీకి వెళ్లిన గవర్నర్ తమిళిసై.. రేపు మరోసారి ప్రధాని మోదీ, అమిత్‌ షాతో భేటీకి ఛాన్స్!