Godavari Biorefineries IPO: రూ. 700 కోట్ల ఐపీవో లాంచ్ చేయనున్న కెమికల్స్ కంపెనీ.. ఇప్పటికే సెబీ నుంచి అనుమతి..

Godavari Biorefineries IPO: ఇథనాల్, బయో ఆధారిత కెమికల్స్ తయారీ సంస్థ గోదావరి బయోఫైనరీస్ లిమిటెడ్ త్వరలోనే ఐపీవోగా రానున్నట్లు ప్రకటించింది. ఐపీవోకు అనువైన పరిస్థితుల కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపింది.

Godavari Biorefineries IPO: రూ. 700 కోట్ల ఐపీవో లాంచ్ చేయనున్న కెమికల్స్ కంపెనీ.. ఇప్పటికే సెబీ నుంచి అనుమతి..
Ipo
Follow us
Ayyappa Mamidi

|

Updated on: Apr 17, 2022 | 8:58 PM

Godavari Biorefineries IPO: ఇథనాల్, బయో ఆధారిత కెమికల్స్ తయారీ సంస్థ గోదావరి బయోఫైనరీస్ లిమిటెడ్ త్వరలోనే ఐపీవోగా రానున్నట్లు ప్రకటించింది. ఐపీవోకు అనువైన పరిస్థితుల కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపింది. ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్(Initial Public Offer) కోసం మార్కెట్ నియంత్రణ సంస్థ సెబి నుంచి ఇప్పటికే తుది ఆమోదం పొందినట్లు గోదావరి బయోఫైనరీస్ లిమిటెడ్ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ సమీర్ సోమయ్య వెల్లడించారు. నవంబర్, 2021 చివరిలో IPOకు సెబీ(SEBI) అనుమతించిందన్నారు. కంపెనీ స్టాక్ ఎక్ఛ్సేంజ్ లో లిస్ట్ కావడానికి ఒక సంవత్సరం సమయం ఉందని ఆయన పేర్కొన్నారు. భౌగోళిక-రాజకీయ పరిస్థితులు అనుకూలంగా అనుకూలంగా మారగానే లిస్టింగ్‌కు ప్లాన్ చేస్తామని అన్నారు.

IPOలో ప్రైమరీగా రూ.370 కోట్లు సేకరించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ప్రైమరీ, సెకండరీ ఎలకేషన్ ద్వారా మెుత్తం రూ.700 కోట్లుగా ఉండనున్నట్లు మార్కెట్ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ నిధులను కర్ణాటకలో చేస్తున్న పెట్టుబడులకు వినియోగించనున్నట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. గోదావరి బయోఫైనరీస్ లిమిటెడ్‌కు పరిశోధన అభివృద్ధి (R&D) యూనిట్లతో పాటు.. కర్ణాటకలోని బాగల్‌కోట్, మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ వద్ద రెండు తయారీ యూనిట్లు ఉన్నాయి. గ్రీన్, సస్టైనబుల్ కెమిస్ట్రీలో భారీ అవకాశాలు ఉన్నందున, కంపెనీ ఇథనాల్ సామర్థ్యాన్ని రోజుకు 380 కిలోలీటర్ల నుంచి 570 కిలోలీటర్ల పెంచటం ప్రారంభించింది. ఈ ప్రక్రియ నవంబర్ నాటికి పూర్తవుతుందని సోమయ్య తెలిపారు. రెండవ తరం ఇథనాల్, ఎనర్జీ కేన్‌ల తయారీలో “అభివృద్ధి దశలో” ఉందని ఆయన చెప్పారు.

కంపెనీ పరిశోధన అభివృద్ధిపై ఎక్కువ దృష్టి సారించినట్లు కంపెనీ వెల్లడించింది. ఇటీవల కంపెనీ ఒక ప్రత్యేక రసాయన కర్మాగారానికి భూమి పూజ నిర్వహించింది. దీనికి తోడు మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌లో పరిశోధనా ప్రయోగశాలను ప్రారంభించింది. ముంబై కేంద్రంగా పనిచేస్తున్న గోదావరి బయోఫైనరీస్ చక్కెర, బయో కెమికల్స్ రెండింటినీ ఎగుమతి చేస్తోంది. దీనికి 20 దేశాల నుంచి కస్టమర్లు ఉన్నారు.

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవీ చదవండి..

Multibagger Stock: రెండేళ్ల కాలంలో లక్షను.. 90 లక్షలు చేసిన మల్టీబ్యాగర్ పెన్నీ స్టాక్..

Campus IPO: వచ్చే నెలలో రానున్న క్యాంపస్ యాక్టివ్‌వేర్ ఐపీఓ.. ఇప్పటికే సెబికి దరఖాస్తు చేసిన కంపెనీ..