Campus IPO: వచ్చే నెలలో రానున్న క్యాంపస్ యాక్టివ్‌వేర్ ఐపీఓ.. ఇప్పటికే సెబికి దరఖాస్తు చేసిన కంపెనీ..
స్పోర్ట్స్, పాదరక్షల తయారీ సంస్థ క్యాంపస్ యాక్టివ్‌వేర్(Campus IPO) వచ్చే నెలలో ఐపీఓ తీసుకురావడానికి ప్లాన్ చేస్తోంది...
స్పోర్ట్స్, పాదరక్షల తయారీ సంస్థ క్యాంపస్ యాక్టివ్‌వేర్(Campus IPO) వచ్చే నెలలో ఐపీఓ తీసుకురావడానికి ప్లాన్ చేస్తోంది. దేశంలోని పశ్చిమ, దక్షిణాది రాష్ట్రాల్లో నెట్‌వర్క్‌ను పెంచడం ద్వారా కంపెనీ తన స్థానాన్ని బలోపేతం చేసుకోవాలని యోచిస్తోంది. కంపెనీ విస్తరణ ప్రణాళికలను ప్రస్తావిస్తూ, క్యాంపస్ యాక్టివ్‌వేర్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (CFO) రామన్ చావ్లా మాట్లాడుతూ మహిళలు(Womens), పిల్లల విభాగంలో కూడా కొత్త ఉత్పత్తులను విడుదల చేయాలని కంపెనీ యోచిస్తోందని తెలిపారు. విస్తరణ కోసం కంపెనీ ప్రత్యేకమైన అవుట్‌లెట్‌ల నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడంతోపాటు ఆన్‌లైన్ విక్రయాలను పెంచడంపై దృష్టి సారిస్తుందని చెప్పారు.
కంపెనీ తన సేల్స్ నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు కొత్త ఉద్యోగులను కూడా రిక్రూట్ చేసుకోవాలని యోచిస్తోందని చావ్లా చెప్పారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా దాదాపు 100 ప్రత్యేక దుకాణాలు ఉన్నాయి. వీటిలో 65 స్టోర్లు కంపెనీకి చెందినవి కాగా మిగిలినవి ఫ్రాంచైజీ మోడల్‌గా ఉన్నాయి. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అమ్మకాల గణాంకాల ఆధారంగా, బ్రాండెడ్ స్పోర్ట్స్ ఫుట్‌వేర్ పరిశ్రమలో క్యాంపస్ దాదాపు 17 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది.
ఈ కంపెనీ గత ఏడాది మాత్రమే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI)కి ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (IPO) కోసం దరఖాస్తును దాఖలు చేసింది. పత్రాల ప్రకారం, క్యాంపస్ IPO కింద 5.1 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (OFS) తీసుకువస్తుంది. దాని ప్రస్తుత ప్రమోటర్లు హరికృష్ణ అగర్వాల్, నిఖిల్ అగర్వాల్‌తో పాటు, TPG గ్రోత్-3 SF ప్రైవేట్ లిమిటెడ్ మరియు QRG ఎంటర్‌ప్రైజెస్ వంటి పెట్టుబడిదారులు కూడా తమ హోల్డింగ్‌లను విక్రయించనున్నారు. ప్రమోటర్లు ప్రస్తుతం క్యాంపస్‌లో 78.21 శాతం వాటాను కలిగి ఉన్నారు.
Read Also.. ICICI Insurance: బంపర్ రిజల్ట్స్ ప్రకటించిన ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ కంపెనీ.. లాభం రెండితలు..