Jayamma Panchayathi: సుమక్క సినిమాపై శ్రీకాకుళం ఎంపీ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఇలాంటి చిత్రాలు..

Jayamma Panchayathi: బుల్లితెరపై మాటల గారడితో మెప్పిస్తోన్న సుమ కనకాల (Suma Kanakala) ఇప్పుడు సిల్వర్‌ స్ర్కీన్‌పై సత్తా చాటేందుకు రెడీ అయింది. కెరీర్‌ ప్రారంభంలో కొన్ని సినిమాల్లో కనిపించిన ఈ స్టార్‌ యాంకర్‌ ..

Jayamma Panchayathi: సుమక్క సినిమాపై శ్రీకాకుళం ఎంపీ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఇలాంటి చిత్రాలు..
Jayamma Panchayathi
Follow us
Basha Shek

| Edited By: Ravi Kiran

Updated on: Apr 18, 2022 | 9:47 AM

Jayamma Panchayathi: బుల్లితెరపై మాటల గారడితో మెప్పిస్తోన్న సుమ కనకాల (Suma Kanakala) ఇప్పుడు సిల్వర్‌ స్ర్కీన్‌పై సత్తా చాటేందుకు రెడీ అయింది. కెరీర్‌ ప్రారంభంలో కొన్ని సినిమాల్లో కనిపించిన  ఈ స్టార్‌ యాంకర్‌ ఆ తర్వాత కేవలం స్మాల్‌స్ర్కీన్‌కే పరిమితమైంది. ఇప్పుడు మళ్లీ వెండితెరపై మెరిసేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే జయమ్మ పంచాయతీ (Jayamma Panchayathi) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మే 6 న థియేటర్లలో ఈ సినిమా సందడి చేయనుంది. ప్రమోషన్‌ కార్యక్రమాల్లో భాగంగా ఇటీవలే పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్‌ విడుదలైంది. ఇందులో ఉత్తరాంధ్ర యాసలో సుమ చెప్పిన డైలాగులు చెప్పి అందరినీ ఆకట్టుకున్నాయి .ఈక్రమంలో శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌ నాయుడు కింజారపు (Ram Mohan Naidu Kinjarapu) సుమక్క సినిమాపై స్పందించారు. ట్రైలర్‌ చాలా బాగుందంటూ ఫేస్‌బుక్‌ వేదికగా ప్రశంసలు కురిపించారు.

జయహో శ్రీకాకుళం.. ‘శ్రీకాకుళం యాసతో సినిమాలు రూపొందించడాన్ని చూసి నేను గర్వపడుతున్నా. మన భాష, సంస్కృతి చూపించే ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలి’ అని ఎంపీ ఫేస్‌బుక్‌ పోస్టులో రాసుకొచ్చారు. ఈ పోస్టుకు #JaiHoSrikakulam అనే హ్యాష్ ట్యాగ్ కూడా ఇచ్చారు. కాగా విజయ్ కుమార్ కలివరపు ఉత్తరాంధ్ర నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. వెన్నెల క్రియేషన్స్ బ్యానర్‌పై బలగ ప్రకాష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎంఎం కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు. సినిమాటోగ్రాఫర్‌గా అనూష్‌ కుమార్, ఆర్ట్ డైరెక్టర్‌గా ధను అంధ్లూరి, ఎడిటర్‌గా రవితేజ గిరిజాల వ్యవహరిస్తున్నారు.

Also Read:Multibagger Stock: రెండేళ్ల కాలంలో లక్షను.. 90 లక్షలు చేసిన మల్టీబ్యాగర్ పెన్నీ స్టాక్..

Jahangirpuri Violence: జహంగీర్‌పురి హింసాకాండలో ఇద్దరు నిందితులకు పోలీసు కస్టడీ.. మరో 12 మందికి జ్యుడీషియల్ రిమాండ్

Bhopal: హనుమాన్ శోభాయాత్రలో ముస్లింల పూల వర్షం.. జై హ‌నుమాన్ అంటూ నినాదాలు..

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!