AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhopal: హనుమాన్ శోభాయాత్రలో ముస్లింల పూల వర్షం.. జై హ‌నుమాన్ అంటూ నినాదాలు..

Bhopal: భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలిచే సంఘటన ఒకటి హ‌నుమాన్ శోభాయాత్రలో (Hanuman Shobha Yatra) చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్(Madhya Pradesh) లోని భోపాల్ లో జరిగిన హనుమాన్..

Bhopal: హనుమాన్ శోభాయాత్రలో ముస్లింల పూల వర్షం.. జై హ‌నుమాన్ అంటూ నినాదాలు..
Hanuman Shobhayatra Muslim
Surya Kala
|

Updated on: Apr 17, 2022 | 7:29 PM

Share

Bhopal: భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలిచే సంఘటన ఒకటి హ‌నుమాన్ శోభాయాత్రలో (Hanuman Shobha Yatra) చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్(Madhya Pradesh) లోని భోపాల్ లో జరిగిన హనుమాన్ శోభాయాత్రలో ముస్లింలు పాల్గొన్నారు. ఊరేగింపులో హ‌నుమంతుడిపై ముస్లి సంఘ సభ్యులు పూల వ‌ర్షం కురిపించారు.  జై హ‌నుమాన్ అంటూ నిన‌దిస్తూ.. భ‌క్తుల‌కు ముస్లింలు హ‌నుమాన్ జ‌యంతి శుభాకాంక్షలు చెప్పారు.

శ్రీరామ నవమి నాడు ఖర్గోన్ లో హింసాకాండ జరిగిన విషయాన్నీ దృష్టిలో పెట్టుకున్న పోలీసులు హనుమాన్ శోభాయాత్ర ఊరేగింపు దారిని మల్లించారు. ఈ శోభాయాత్రలో సుమారు 5 వేల మంది భ‌క్తులు పాల్గొన్నారు. భారీ పోలీసు బందోబస్తు నడుమ హనుమాన్ జయంతి సందర్భంగా భక్తులు భారీ ఊరేగింపు నిర్వహించారు.  భద్రత సమస్యల కారణంగా ఖాజీ క్యాంపు ప్రాంతంలో ఊరేగింపుకు అనుమతిని పోలీసులు రద్దు చేశారు.  తినుబండారాలు, టీ స్టాల్స్ మినహా చాలా వ్యాపార సంస్థలను మూసివేశారు. రహదారులపై భారీగా బారికేడ్లు వేశారు.

హనుమాన్ జయంతి ఊరేగింపు కాళీ మందిర్, తాళ్లయా నుండి బయలుదేరి చార్ బత్తి చౌరాహా, బుద్వారా, ఇత్వారా, ఆజాద్ మార్కెట్, జుమెరాటి, గోదా నక్కాస్, నద్రా బస్టాండ్ మీదుగా సాగి సింధీ కాలనీ వద్ద ముగిసింది. రాష్ట్ర రాజధాని నలుమూలల నుండి తరలివచ్చిన సుమారు 5,000 మంది భక్తులు, జై జై శ్రీరామ్ అని నినాదాలు చేస్తూ, తమ చేతుల్లో కాషాయ జెండాలను పట్టుకుని ఊరేగింపులో ఉన్నారు. ఇటీవలి మత విద్వేషాలను దృష్టిలో ఉంచుకుని, ఇతర మతాలు లేదా వర్గాల ప్రజల మనోభావాలను దెబ్బతీసే అభ్యంతరకర నినాదాలు, బ్యానర్లు, పోస్టర్లను అనుమతించ లేదు. భోపాల్ న‌గ‌రం కాషాయం జెండాల‌తో మెరిసిపోయింది.

Also Read:

నాకే ఎందుకు ఇలా అన్న కర్ణతో.. జీవితం ఎవరికి ఈజీ కాదు.. నా జీవితమే అందుకు ఉదాహరణ అన్న శ్రీకృష్ణ

పెరుగుని ఇష్టారీతిలో తింటున్నారా.. అయితే ఈ నియమాలు పాటించాల్సిందే.. అంటోన్న ఆయుర్వేదం