Shocker: ఎంత పని చేశావమ్మా..! పతి లేడని తెలిసి… ప్రాణంగా పెంచుకున్న బిడ్డనే

భర్త మరణాన్ని ఆ ఇల్లాలు తట్టుకోలేకపోయింది. అతను లేని జీవితం వ్యర్థం అని భావించింది. ఈ క్రమంలోనే 6 నెలల బిడ్డడి ప్రాణాలు తీసింది.

Shocker: ఎంత పని చేశావమ్మా..! పతి లేడని తెలిసి... ప్రాణంగా పెంచుకున్న బిడ్డనే
Tragedy
Follow us
Ram Naramaneni

|

Updated on: Apr 17, 2022 | 7:26 PM

Tragedy: ఆమె భర్త, బిడ్డే తన సర్వస్వంగా భావించింది. ఎంతో ఆనందంగా సాగిపోతున్న ఆ చిన్న కుటుంబంలో రోడ్డు ప్రమాదం.. కొండంత విషాదాన్ని నింపింది.  భర్త చనిపోయాడన్న బాధతో తన ఆరు నెలల కుమారుడిని చంపి, ఆపై తానూ ఆత్మహత్య చేసుకుంది ఓ గృహిణి. ఈ ఘటన కర్ణాటక(Karnataka) రాయ్​చూర్(Raichur)​​లో శనివారం జరిగింది. గంగాధర్​ బి కమ్మర(36), శ్రుతి(30) భార్యాభర్తలు. వీరికి 6 నెలల క్రితమే బాబు పుట్టాడు. కాగా మంగళూరులోని ఫైర్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్‌లో గంగాధర్ డ్రైవర్​గా జాబ్ చేస్తున్నాడు. రాయ్​చూర్​​లో ఇతను ఫ్యామిలీతో కలిసి నివాసం ఉంటున్నాడు. కాగా శనివారం రాత్రి జరిగిన రోడ్డు యాక్సిడెంట్‌లో గంగాధర్ అకస్మాత్తుగా ప్రాణాలు విడిచాడు. కుంటికాన సమీపంలో గంగాధర్​ రోడ్డు దాటుతుండగా బెంగళూరు నుంచి కుందాపుర్ వెళ్తున్న కారు ఢీకొట్టడం వల్ల స్పాట్‌లోనే దుర్మరణం చెందాడు. ఈ విషయం రాయచూర్‌లో ఉన్న అతని భార్యకు తెలిసింది. దీంతో ఒక్కసారిగా ఆమె దిగ్భ్రాంతి గురైంది. భర్త మరణ వార్త విని జీర్ణించుకోలేకపోయింది. అతను లేకుండా తన జీవితమే వ్యర్థమని భావించింది. శనివారం రాత్రి 10 గంటల సమయంలో తన ఆరు నెలల చిన్నారి అభిరామ్​ను చంపి, తాను సూసైడ్ చేసుకుంది. ఘటనపై మంగళూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు గంగాధర్ ఇంటికి చేరుకుని విచారణ చేపట్టారు.

Also Read: Telangana: తల్లీ కూతుళ్లతో వ్యక్తి ఎఫైర్.. ఆపై ఊహించని ఇన్సిడెంట్.. విచారణలో విస్తుపోయే నిజాలు

ఏపీ, తెలంగాణ మధ్య పోటీ అవసరం లేదు: సీఎం రేవంత్ రెడ్డి
ఏపీ, తెలంగాణ మధ్య పోటీ అవసరం లేదు: సీఎం రేవంత్ రెడ్డి
హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..
హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..
సంక్రాంతి తర్వాత ఆ రాశుల వారికి ఆర్థిక విజయాలు
సంక్రాంతి తర్వాత ఆ రాశుల వారికి ఆర్థిక విజయాలు
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్
రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!
రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!
22 బంతుల్లోనే 106 రన్స్..17 ఏళ్ల కుర్రాడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్
22 బంతుల్లోనే 106 రన్స్..17 ఏళ్ల కుర్రాడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్
పది మంది కడుపు నింపుతున్న ఈ వ్యక్తి గురించి సలాం కొట్టాల్సిందే!
పది మంది కడుపు నింపుతున్న ఈ వ్యక్తి గురించి సలాం కొట్టాల్సిందే!
దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్
దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్
అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..
అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..
నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!
నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!