AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

R Madhavan: పుత్రోత్సాహంలో నటుడు మాధవన్.. స్విమ్మింగ్‌లో సిల్వర్ గెలుచుకున్న కొడుకు.. శుభాకాంక్షలు వెల్లువ

R Madhavan: తండ్రికి నిజమైన పుత్రోత్సాహం కొడుకు పుట్టినప్పుడు కాదు.. ఆ కొడుకు ఎదిగి.. అందరూ తన కొడుకుని పోగుతున్నప్పుడు కలుగుతుంది. ప్రస్తుతం ప్రముఖ నటుడు ఆర్ మాధవన్ పుత్రోహంతో..

R Madhavan: పుత్రోత్సాహంలో నటుడు మాధవన్.. స్విమ్మింగ్‌లో సిల్వర్ గెలుచుకున్న కొడుకు.. శుభాకాంక్షలు వెల్లువ
R Madhavan Son Vedaant
Surya Kala
|

Updated on: Apr 17, 2022 | 8:29 PM

Share

R Madhavan: తండ్రికి నిజమైన పుత్రోత్సాహం కొడుకు పుట్టినప్పుడు కాదు.. ఆ కొడుకు ఎదిగి.. అందరూ తన కొడుకుని పోగుతున్నప్పుడు కలుగుతుంది. ప్రస్తుతం ప్రముఖ నటుడు ఆర్ మాధవన్ పుత్రోహంతో పొంగిపోతున్నాడు. మాధవన్  కుమారుడు వేదాంత్ మాధవన్(Vedanth Madhavan) డెన్మార్క్ ఓపెన్ 2022 ( Danish Open 2022) లో స్విమ్మింగ్‌లో రజత పతకాన్ని గెలుచుకున్నాడు. తన కుమారుడు మెడల్ గెలుచుకున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. కోపెన్ హాగ‌న్ లో జ‌రిగిన‌ డానిష్ ఓపెన్ 2022 (Danish Open 2022) పోటీల్లో వేదాంత్ 1500 మీటర్ల ఫ్రీస్టైల్ స్విమ్మింగ్ ఈవెంట్‌లో పతకాన్ని గెలుచుకున్నారు. 15:57:86 సమయంలో లక్ష్యాన్ని చేరుకొని సిల్వర్ మెడల్ ను సొంతం చేసుకున్నాడు. వేదాంత్ కు సిల్వర్ మెడ‌ల్‌ను ప్రక‌టిస్తున్న వీడియోను ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు మాధ‌వ‌న్‌.  తన కొడుకు భారత దేశం గర్వించేలా చేశాడు అంటూ కామెంట్ జత చేశాడు.

View this post on Instagram

A post shared by R. Madhavan (@actormaddy)

“కోపెన్‌హాగన్‌లో జరిగిన డెన్మార్క్ ఓపెన్‌లో మీ అందరి ఆశీస్సులతో  వేదాంత్ మాధవన్ రజతం గెలుచుకున్నాడు. స్విమ్మింగ్ ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియా కోచ్ ప్రదీప్, అన్సాద్‌కు మీ కృషి ఫలించింది అంటూ ధ‌న్యవాదాలు చెప్పాడు.

మేము చాలా గర్వపడుతున్నామని  అన్నాడు. దేశానికి వన్నె తెచ్చిన వేదాంత్ మాధవన్ కు సెలబ్రెటీలు, నెటిజన్లు, శుభాకాంక్షలు వర్షం కురిపిస్తున్నారు. అభిషేక్ బచ్చన్  న‌టి శిల్పాశెట్టి, న‌మ్రతాశిరోద్కర్, ఇషా డియోల్, రోహిత్ లతో పాటు అనేక మంది నెటిజ‌న్లు, ఫాలోవ‌ర్లు వేదాంత్ కు శుభాకాంక్షలు చెబుతున్నారు.

Also Read: Odisha: సముద్ర తీరంలో సంతోషంగా తండ్రి కొడుకులు ఆటలు.. అలల తాకిడికి అంతలోనే విషాదం..