AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

The Warriorr : రామ్ పోతినేని సినిమాకోసం రంగంలోకి దిగిన స్టార్ హీరో శింబు..

టాలీవుడ్ యంగ్ హీరోస్ లో ప్రస్తుతం ఫుల్ జోష్ లో దూసుకుపోతున్న హీరో రామ్ పోతినేని. ఈ కుర్ర హీరో ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టి ఇప్పుడు వారియర్ గా ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు.

The Warriorr : రామ్ పోతినేని సినిమాకోసం రంగంలోకి దిగిన స్టార్ హీరో శింబు..
Ram
Rajeev Rayala
| Edited By: Ravi Kiran|

Updated on: Apr 18, 2022 | 9:58 AM

Share

టాలీవుడ్ యంగ్ హీరోస్ లో ప్రస్తుతం ఫుల్ జోష్ లో దూసుకుపోతున్న హీరో రామ్ పోతినేని. ఈ కుర్ర హీరో ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టి ఇప్పుడు వారియర్ గా ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. రామ్ హీరోగా  ‘ది వారియర్'(The Warriorr )మూవీ తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోంది. తమిళ అగ్ర దర్శకుడు లింగుస్వామి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్ పతాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం. 6గా శ్రీనివాసా చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఈ చిత్రంలో రామ్ సరసన కృతి శెట్టి కథానాయికగా నటిస్తున్నారు. ఆది పినిశెట్టి ప్రతినాయకుడి పాత్ర చేస్తున్నారు. అక్షరా గౌడ కీలక పాత్రలో కనిపించనున్నారు. జూలై 14న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున విడుదల కానుంది వారియర్. ఈ సినిమాలో ఓ స్పెషాలిటీ ఉందట అదేంటంటే..

ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలోని ఓ స్పెషల్ సాంగ్ ను ఓ స్టార్ హీరోతో పండించాలని దేవీ శ్రీ భావించారు. వెంటనే ఆయన తమిళ్ హీరో శింబు ను రంగంలోకి దింపారు. ఈ సినిమాలో ‘బుల్లెట్…’ సాంగ్‌ను శింబు ఆలపించారు. తాజాగా ఈ పాటను రికార్డ్ చేశారు దేవీశ్రీ. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరిదశలో ఉంది. ఆల్రెడీ విడుదల చేసిన రామ్ స్టిల్స్, ఆది పినిశెట్టి లుక్స్, కృతి శెట్టి లుక్స్ ప్రేక్షకులందర్నీ ఆకట్టుకుంటున్నాయి. సినిమాపై అంచనాలు పెంచాయి. ఆ అంచనాలను అందుకునేలా లింగుస్వామి సినిమాను తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Viral Photo: ఇతను కళ్లతో మాయ చేస్తాడు.. మాటలతో బూరెలు వండేస్తాడు… ఎవరో గుర్తించారా..?

Soundarya Death Anniversary: చెక్కుచెదరని చిరునవ్వు.. చూడగానే ఆకట్టుకునే నిలువెత్తు రూపం.. నేడు సౌందర్య వర్థంతి

Acharya: మెగాస్టార్‌ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు డేట్‌ ఫిక్స్‌.. ముఖ్య అతిథిగా ఎవరు రానున్నారంటే!