Acharya: మెగాస్టార్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు డేట్ ఫిక్స్.. ముఖ్య అతిథిగా ఎవరు రానున్నారంటే!
Acharya Pre Release Event: సైరా నరసింహారెడ్డి తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) త్వరలో ఆచార్య (Acharya) గా మన ముందుకు వస్తున్నారు.
Acharya Pre Release Event: సైరా నరసింహారెడ్డి తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) త్వరలో ఆచార్య (Acharya) గా మన ముందుకు వస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. చిరంజీవి తనయుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ (Ramcharan) కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. కాజల్, పూజాహెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తైనప్పటికీ ఈ చిత్రం వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఎట్టకేలకు ఈనెల 29న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమైంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది చిత్రబృందం. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తోంది. మరోవైపు చిరంజీవి, చరణ్ లు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాను ప్రజల్లోకి తీసుకెళుతున్నారు. కాగా ఆచార్య ప్రీ రిలీజ్ వేడుకకు ముహూర్తం ఫిక్సైంది. ఈనెల 23న హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా ఈ ఈవెంట్‌ను నిర్వహించేందుకు మూవీ మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు.
కాగా పాన్ ఇండియా స్థాయిలో ఈ మెగా మూవీ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రీ రిలీజ్ వేడుకను కూడా గ్రాండ్‌గా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈవేడుకకు ఏపీ సీఎం జగన్ ముఖ్య అతిథిగా వస్తు్న్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషంపై చిత్రబృందం ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. అలాగే జనసేనాని పవన్ కల్యాణ్ కూడా హాజరుకానున్నట్లు తెలుస్తోంది. దీనిపై కూడా క్లారిటీ లేదు. దర్శకధీరుడు రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్ తో పాటు పలువురు మెగా, అల్లు కుటుంబ సభ్యులు రావొచ్చనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. కాగా శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఆచార్య చిత్రాన్ని నిర్మించారు. సోనూసూద్, వెన్నెల కిశోర్, పోసాని కృష్ణమురళి, తనికెళ్ల భరణి, అజయ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మణిశర్మ స్వరాలు సమకూరుస్తున్నారు.
Also Read:Ravi Teja : మాస్ మహారాజా కోసం భారీ సెట్.. ఏకంగా ఏడు కోట్ల రూపాయలతో ఆ నిర్మాణం..
RRR Movie: అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘కొమ్మ ఉయ్యాల్లో’ పాట వచ్చేసిందోచ్
Instant Dosa Recipe: ఈజీగా టేస్టీగా 15 నిమిషాల్లో తయారు చేసుకునే ఓట్స్ దోశ రెసిపీ మీ కోసం..