Ravi Teja : మాస్ మహారాజా కోసం భారీ సెట్.. ఏకంగా ఏడు కోట్ల రూపాయలతో ఆ నిర్మాణం..

మాస్ మహారాజా రవితేజ తొలి పాన్ ఇండియా చిత్రం 'టైగర్ నాగేశ్వరరావు'ఇంకా షూటింగ్ మొదలుపెట్టకుండానే అందరిలోనూ ఆసక్తిని పెంచుతుంది.

Ravi Teja : మాస్ మహారాజా కోసం భారీ సెట్.. ఏకంగా ఏడు కోట్ల రూపాయలతో ఆ నిర్మాణం..
Raviteja
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 16, 2022 | 9:32 PM

మాస్ మహారాజా రవితేజ(Ravi Teja)తొలి పాన్ ఇండియా చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’ఇంకా షూటింగ్ మొదలుపెట్టకుండానే అందరిలోనూ ఆసక్తిని పెంచుతుంది. వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుకను గ్రాండ్ గా నిర్వహించగా, టైటిల్‌తో పాటు ప్రీ-లుక్ పోస్టర్లు చాలా క్యూరియాసిటీని పెంచాయి. ఇప్పుడు సినిమా షూటింగ్‌ని ప్రారంభించేందుకు చిత్రబృందం సిద్ధమైయింది. అభిషేక్ అగర్వాల్ నిర్మాతగా అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌ బ్యానర్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎక్కడా రాజీపడకుండా ఉన్నత నిర్మాణ విలువలతో ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. ప్రీ-ప్రొడక్షన్ పనులపై కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రవితేజ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రమిది.

స్టువర్ట్‌పురం రాబిన్ హుడ్ గా పేరుపొందిన టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ గా 70 వ దశకం నాటి స్టువర్ట్‌పురం నేపధ్యంలో ఈ సినిమా ఉండబోతుంది. టైగర్ నాగేశ్వరరావు కోసం రవితేజ సరికొత్తగా మేకోవర్ అయ్యారు. మునుపెన్నడూ లేని విధంగా రవితేజ బాడీ లాంగ్వేజ్, డిక్షన్, గెటప్ పూర్తి భిన్నంగా ఉండబోతున్నాయి. ఈ సినిమాలో రవితేజ సరసన నూపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా కనిపించబోతున్నారు. మహానటి, జెర్సీ, ఎవరు, శ్యామ్ సింగరాయ్ లాంటి సూపర్‌హిట్ చిత్రాలకు పనిచేసిన అవినాష్ కొల్లా ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. ఆయన పర్యవేక్షణలో 7 కోట్ల రూపాయిల ఖర్చుతో 70వ దశకంలో నాటి స్టూవర్టుపురంను చిత్రీకరీంచడానికి ఓ భారీ సెట్‌ ని నిర్మిస్తున్నారు. శంషాబాద్ సమీపంలో 5 ఎకరాల్లో ఈ సెట్‌ను నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఆర్‌ మదీ సినిమాటోగ్రాఫర్‌ గా పని చేస్తున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాష్‌ కుమార్‌ సంగీతం అందిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Happy Birthday JD Chakravarthy: పలు భాషల్లో విలక్షణ నటుడి హవా.. వరుస సినిమాలతో జేడీ చక్రవర్తి ఫుల్ బిజీ..

Avantika Mishra: గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న ‘వైశాఖం’ బ్యూటీ.. వైరల్ అవుతున్న ఫోటోలు

Jayamma Panchayathi: జయమ్మ పంచాయతీ ట్రైలర్ వచ్చేసింది.. అదరగొట్టిన సుమక్క..

ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
ప్లాన్ చేసే ఆ హీరోయిన్‌కు ముద్దిచ్చా.. షాకిచ్చిన స్టార్ హీరో
ప్లాన్ చేసే ఆ హీరోయిన్‌కు ముద్దిచ్చా.. షాకిచ్చిన స్టార్ హీరో
బన్నీని సపోర్ట్‌ చేస్తూ.. నేషనల్ మీడియాలో రచ్చ చేసిన హీరోయిన్
బన్నీని సపోర్ట్‌ చేస్తూ.. నేషనల్ మీడియాలో రచ్చ చేసిన హీరోయిన్
అల్లు అర్జున్‌ను కలిశారా ?? ఫోన్ చేశారా ?? జానీ మాస్టర్ ఆన్సర్
అల్లు అర్జున్‌ను కలిశారా ?? ఫోన్ చేశారా ?? జానీ మాస్టర్ ఆన్సర్
శ్రీతేజ్ కోసం వేణుస్వామి.. మృత్యుంజయ హోమం !!
శ్రీతేజ్ కోసం వేణుస్వామి.. మృత్యుంజయ హోమం !!