RRR Vs KGF 2: పాన్ ఇండియాను షేక్ చేసిన రాకీ బాయ్, రాజమౌళి..

ట్రిపులార్‌, కేజీఎఫ్‌... సౌత్‌ మేకర్స్ రెడీ చేసిన పాన్ ఇండియా మూవీస్‌. ఇండియన్‌ సినిమా రేంజ్‌ను పెంచే మాస్ యాక్షన్‌ విజువల్ వండర్స్‌. రెండు వారాల గ్యాప్‌లో రిలీజ్ అయిన ఈ రెండు సినిమాలు బిగ్గెస్ట్ ఎవర్‌ హిట్స్‌గా రికార్డ్స్‌ సెట్‌ చేశాయి.

RRR Vs KGF 2: పాన్ ఇండియాను షేక్ చేసిన రాకీ బాయ్, రాజమౌళి..
Kgf 2 And Rrr
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 16, 2022 | 9:23 PM

ట్రిపులార్‌, కేజీఎఫ్‌.. సౌత్‌ మేకర్స్ రెడీ చేసిన పాన్ ఇండియా మూవీస్‌. ఇండియన్‌ సినిమా రేంజ్‌ను పెంచే మాస్ యాక్షన్‌ విజువల్ వండర్స్‌. రెండు వారాల గ్యాప్‌లో రిలీజ్ అయిన ఈ రెండు సినిమాలు బిగ్గెస్ట్ ఎవర్‌ హిట్స్‌గా రికార్డ్స్‌ సెట్‌ చేశాయి. ఇప్పటికీ సరికొత్త రికార్డ్స్‌ను నమోదు చేస్తూనే ఉన్నాయి. దీంతో రెండు సినిమాల విషయంలో కంపారిజన్ మొదలైంది. ఇండియాస్ బిగ్గెస్ట్‌ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన భారీ మల్టీస్టారర్‌ ట్రిపులార్‌. బాహుబలి సినిమా తరువాత రాజమౌళి డైరెక్షన్‌లో తెరకెక్కిన సినిమా కావటంతో ట్రిపులార్ మీద ముందు నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. దీనికి తోడు ఇద్దరు టాప్ హీరోలు కలిసి నటించటం..పేట్రియాటిక్ యాంగిల్ కూడా ఉండటంతో ట్రిపులార్ నేషనల్ లెవల్లో హాట్‌ టాపిక్ గా మారింది. ఇంత హై ఎక్స్‌పెక్టేషన్స్ మధ్య రిలీజ్ అయిన ట్రిపులార్‌ డే వన్ కాస్త తడబడింది. అభిమానుల అంచనాలు భారీ స్థాయిలో ఉండటం, కంటెంట్‌ మీద అక్కడక్కడ కంప్లయిట్స్ ఉండటంతో మిక్స్ట్ టాక్‌ వినిపించింది. అయితే నెమ్మదిగా నెగిటివిటీ తగ్గి సక్సెస్‌ ట్రెండ్‌ లోకి ఎంట్రీ ఇచ్చింది ట్రిపులార్‌.

ట్రిపులార్ హవా కొనసాగుతుండగానే థియేటర్లలోకి ఎంట్రీ ఇచ్చారు రాకీ భాయ్‌. చాప్టర్ వన్‌లోనే కేజీఎఫ్‌తో పాటు పాన్ ఇండియా మార్కెట్‌ను కాంకర్ చేసిన యష్.. చాప్టర్‌ 2 లో విశ్వరూపం చూపించారు. యాక్షన్‌, ఎలివేషన్‌, ఎమోషన్‌.. ప్రతీ విషయంలోనూ అంతకు మించి అన్న రేంజ్‌లో ఉంది కేజీఎఫ్ 2 అందుకే వెరీ ఫస్ట్ షో నుంచి కేజీఎఫ్‌కు బ్లాక్‌ బస్టర్ టాక్ వచ్చింది. ముఖ్యంగా ఆడియన్స్‌కు గూజ్‌బంప్స్ తెప్పించే సీన్స్ అన్‌లిమిటెడ్‌గా ఉండటం కూడా కేజీఎఫ్ చాప్టర్‌ 2కు కలిసొచ్చింది. ఆల్రెడీ కేజీఎఫ్‌ వరల్డ్‌ను ఎక్స్‌పీరియన్స్‌ చేసిన ఆడియన్స్‌కు కొత్త ఫీల్‌ కలిగించటంలో సూపర్ సక్సెస్ అయ్యారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. జక్కన్న లాంటి మాస్టర్ స్టోరీ టెల్లర్ కూడా యూనానిమస్‌ టాక్‌ సాధించటంలో ఫెయిల్‌ అయినా.. ప్రశాంత్‌ నీల్‌ మాత్రం ఆ టాస్క్‌ను ఈజీగానే ఫినిష్ చేయగలిగారు. అయితే ట్రిపులార్ విషయంలో నెగెటివిటీకి మెయిన్ రీజన్‌ ఎక్స్‌పెక్టేషన్స్‌. ఇద్దరు హీరోలు.. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా, చారిత్రక పురుషుల కల్పితగాథ కావటంతో అభిమానులు కంటెంట్ మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు. ఏ రేంజ్‌హోప్స్ అంటే.. జక్కన్న కూడా ఆ అంచనాలు రీచ్ అవ్వలేకపోయారు.

కానీ కేజీఎఫ్ విషయంలో మాత్రం అంచనాలు ఆ రేంజ్‌లో లేకపోవటం కలిసొచ్చింది. ఆల్రెడీ సినిమా కథా కథనాలతో పాటు ప్రశాంత్ టేకింగ్ మీద ఆడియన్స్‌కు ఓ క్లారిటీ ఉంది. అందుకే సినిమా ఎలా ఉండబోతోంది అన్న క్లారిటీతోనే థియేటర్లలోకి అడుగుపెట్టారు ఆడియన్స్‌. ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌ను రాకీభాయ్‌ పర్ఫెక్ట్‌గా రీచ్ అయ్యారు. అందుకే కేజీఎఫ్‌ 2కి యూనానిమస్ పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ట్రిపులార్ మల్టీ స్టారర్‌ కావటం వల్ల కూడా కొంత నెగెటివిటీ వచ్చింది. ఒక్క హీరోనే ఎలివేట్ చేశారని.. ఒక్క హీరోకే ఎక్కువ స్క్రీన్‌ స్పేస్ దక్కిందన్న కంప్లయిట్స్ వినిపించాయి. దీంతో ఓ సెక్షన్‌ ఆఫ్ ఆడియన్స్‌ సినిమా మీద అలిగారు. అది కూడా టాక్ మీద ఎఫెక్ట్ చూపించిందంటారు ట్రేడ్‌ పండిట్స్.కేజీఎఫ్ సోలో హీరో సినిమా. అంతకు మించి రాకీభాయ్‌గా ఆడియన్స్‌ గుండెల్లో ఆల్రెడీ మంచి అంచనాలున్న క్యారెక్టర్‌. అందుకే ఆటోమేటిక్‌గా ఆడియన్స్‌కు రీ కనెక్ట్ అయ్యింది కేజీఎఫ్ చాఫ్టర్‌ 2. ఇలా రెండు సినిమాలవి రెండు డిఫరెంట్‌ బ్యాక్ గ్రౌండ్స్ కావటంతో ప్రైమరీ టాక్ కూడా డిఫరెంట్‌గానే వచ్చింది. కానీ బాక్సాఫీస్‌ దగ్గర గలగలలు మాత్రం సేమ్ టు సేమ్ వినిపిస్తాయనే హోప్స్ తో ఉన్నాయి ఇండస్ట్రీ వర్గాలు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Happy Birthday JD Chakravarthy: పలు భాషల్లో విలక్షణ నటుడి హవా.. వరుస సినిమాలతో జేడీ చక్రవర్తి ఫుల్ బిజీ..

Avantika Mishra: గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న ‘వైశాఖం’ బ్యూటీ.. వైరల్ అవుతున్న ఫోటోలు

Jayamma Panchayathi: జయమ్మ పంచాయతీ ట్రైలర్ వచ్చేసింది.. అదరగొట్టిన సుమక్క..

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో