Jayamma Panchayathi: జయమ్మ పంచాయతీ ట్రైలర్ వచ్చేసింది.. అదరగొట్టిన సుమక్క..

సుమ కనకాల రాబోయే సినిమా ' జయమ్మ పంచాయతీ ' థియేట్రికల్ ట్రైలర్‌ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంచ్ చేశారు. ఈ సినిమా మే 6 న థియేటర్లలో విడుదల కానుంది.

Jayamma Panchayathi: జయమ్మ పంచాయతీ ట్రైలర్ వచ్చేసింది.. అదరగొట్టిన సుమక్క..
Jayamma Panchayathi Theatrical Trailer
Follow us
Venkata Chari

| Edited By: Ravi Kiran

Updated on: Apr 16, 2022 | 1:01 PM

సుమ కనకాల(Suma Kanakala) రాబోయే సినిమా ‘ జయమ్మ పంచాయతీ ‘(Jayamma Panchayathi) థియేట్రికల్ ట్రైలర్‌ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Powe star pawan Kalyan) లాంచ్ చేశారు. ఈ సినిమా మే 6 న థియేటర్లలో విడుదల కానుంది. ప్రముఖ యాంకర్, బుల్లితెర వ్యాఖ్యాత, హోస్ట్ సుమ కనకాల కమ్ బ్యాక్ ఫిల్మ్ ‘జయమ్మ పంచాయతీ’ విడుదలకు సిద్ధంగా ఉంది. సినిమా విడుదలకు ముందే జోరుగా ప్రమోషన్స్ జరుగుతున్నాయి. ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను నేడు విడుదల చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా పాల్గొని ఈ ట్రైలర్ లాంచ్ చేశారు. ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. గ్రామ సభ ముందు జయమ్మ లేవనెత్తిన సమస్యను ట్రైలర్‌లో చూపించకపోయినప్పటికీ, అది తీవ్ర ప్రభావం చూపుతుంది. ఆమె భర్త అనారోగ్యంతో ఉంటాడు. ఆమె తన వ్యక్తిగత సమస్యలను పరిష్కరించడానికి ఒక బలమైన నిర్ణయం తీసుకుంటుంది. తన నిర్ణయానికి కట్టుబడిన ఆమె గ్రామంపై కూడా పోరాటానికి సిద్ధమవుతుంది. ఒక పూజారికి, అతని లవర్ మధ్య జరిగే ప్రేమకథ ట్రైలర్‌లో చూపించారు. ఈ విలేజ్ డ్రామా ట్రైలర్‌లో ఇతర పాత్రలను కూడా మనం చూడొచ్చు.

ఈ ట్రైలర్‌లో సమ తన నటనతో మరోసారి ఆకట్టుకుంటి. దీంతో తక్షణమే మనం ఆ పాత్రకు కనెక్ట్ అయిపోతాం. దర్శకుడు విజయ్ కుమార్ కలివరపు తన రచన, టేకింగ్‌తో ఆకట్టుకున్నాడు. అనూష్ కుమార్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకోగా, ఎంఎం కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విజువల్స్ మెప్పించాయి. వెన్నెల క్రియేషన్స్ బ్యానర్‌పై బలగ ప్రకాష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సినిమాటోగ్రాఫర్‌గా అనుష్క కుమార్, మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎంఎం కీరవాణి, ఆర్ట్ డైరెక్టర్‌గా ధను అంధ్లూరి, ఎడిటర్‌గా రవితేజ గిరిజాల ఈ సినిమా కోసం పనిచేశారు.

Also Read: Alia Ranbir Wedding: రణబీర్-అలియా అన్‌సీన్ ఫోటోలు.. సోషల్ మీడియాలో వైరల్..

Prabhas: ఆ హీరోలతో పోటీపై ప్రభాస్ ఆసక్తికర వ్యాఖ్యలు.. అసలు ఏమన్నాడంటే.!

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో