AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas: ఆ హీరోలతో పోటీపై ప్రభాస్ ఆసక్తికర వ్యాఖ్యలు.. అసలు ఏమన్నాడంటే.!

రెబల్ స్టార్ ప్రభాస్, బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో జాతీయ స్థాయిలో తన సత్తా చాటి, పలు రికార్డులు కొల్లగొట్టాడు. ఈ క్రమంలోనే తన తదుపరి సినిమాలను కూడా అదే రేంజ్‌లో తీసుకొచ్చేందుకు డార్లింగ్..

Prabhas: ఆ హీరోలతో పోటీపై ప్రభాస్ ఆసక్తికర వ్యాఖ్యలు.. అసలు ఏమన్నాడంటే.!
Prabhas
Venkata Chari
|

Updated on: Apr 16, 2022 | 12:02 PM

Share

రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas), బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో జాతీయ స్థాయిలో తన సత్తా చాటి, పలు రికార్డులు కొల్లగొట్టాడు. ఈ క్రమంలోనే తన తదుపరి సినిమాలను కూడా అదే రేంజ్‌లో తీసుకొచ్చేందుకు డార్లింగ్ ప్లాన్ చేస్తున్నాడు. అయితే, తాజాగా వచ్చిన రాధేశ్యామ్(Radhe Shyam) సినిమా మాత్రం అట్టర్ ఫ్లాప్ అవ్వడం ఫ్యాన్స్‌కు నిరాశనే మిగిల్చింది. కాగా, పాన్ ఇండియా లెవల్లో సినిమాలు తీస్తున్న మిగతా హీరోల విషయంతా తన అభిప్రాయాలను పంచుకున్నాడు. సౌత్ ఇండియా(South India) నుంచి పాన్ ఇండియా స్టార్ డమ్ తెచ్చుకున్న హీరోలపై మాట్లాడుతూ, అనుకుంటేనే పోటీ ఉంటుంది. అందరం కలిసి భారతీయ సినిమాలు చేస్తున్నాం అంటూ చెప్పుకొచ్చాడు.

కాగా, స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్‌కు ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ పొందాడు. ఇక ఎన్టీఆర్, రామ్ చరణ్‌లకు ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాతో గుర్తింపు రాగా, కన్నడ హీరో యష్ ‘కేజీఎఫ్’తో ఇలాంటి క్రేజ్‌ను సొంతం చేసుకున్న లిస్టులో చేరిపోయాడు. ఈ నేపథ్యంలో డార్లింగ్ ప్రభాస్ సౌత్ పాన్ ఇండియా హీరోలతో ఉన్న పోటీపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.

ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, యశ్ వంటి హీరోల నుంచి పోటీ ఉంటుందా అనే ప్రశ్నపై మాట్లాడుతూ, ”పోటీ ఏ రంగంలోనైనా ఉంటుంది. సినిమాల్లోనూ అది కామనే. సౌత్ సినిమాలకు దేశవ్యాప్తంగా మార్కెట్ లభించింది. ఈ మధ్య ఈ మార్కెట్ మరింత ఎక్కువైంది. చాలామంది హీరోలు కూడా అలాంటి సినిమాలనే ఎంచుకుంటూ దూసుకెళ్తున్నారు. అయితే, మంచి విషయం ఏంటంటే, అంతా కలిసి భారతీయ సినిమాలు చేస్తున్నాం” అంటూ చెప్పుకొచ్చాడు.

ఇక ఆర్ఆర్ఆర్ సినిమాపై తన అభిప్రాయం పంచుకుంటూ ”నేను ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా చూశాను. నాకు బాగా నచ్చింది. ఆర్ఆర్ఆర్ రూ.1000 కోట్లకి పైగా కలెక్షన్స్ సాధించడం ఆనందంగా ఉంది. ఈ సినిమాతో మరోసారి రాజమౌళి కేవలం సౌత్‌కే కాదు ఇండియన్ డైరెక్టర్‌గా నిరూపించుకున్నాడు” అని తెలిపాడు.

కాగా, ప్రభాస్ తర్వలో మరిన్ని సినిమాలను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఓం రౌత్ డైరెక్షన్‌లో ‘ఆదిపురుష్’ సినిమాలో నటిస్తున్నాడు. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్‌తో ‘సలార్’, నాగ్ అశ్విన్ సినిమా ‘ప్రాజెక్ట్ K’ లాంటి పాన్ వరల్డ్ సినిమాలతో దూసుకపోతున్నాడు. వీటితోపాటు సందీప్ వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ సినిమా చేసేందుకు ఓకే చెప్పాడు. అలాగే మారుతి డైరెక్షన్‌లోనూ ఓ సినిమాను తెరకెక్కించనున్నాడు.

Also Read: Beast OTT Release: ఓటీటీ బాట పట్టిన ‘బీస్ట్‌’.. స్ట్రీమింగ్ ఎప్పుడో తెలుసా?

ivetha Pethuraj:హాట్ లుక్స్ తో మైకంలో ముంచెత్తుతున్న నివేత లేటెస్ట్ ఫోటోస్ వైరల్