AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Beast OTT Release: ఓటీటీ బాట పట్టిన ‘బీస్ట్‌’.. స్ట్రీమింగ్ ఎప్పుడో తెలుసా?

మిళ స్టార్‌ హీరో విజయ్‌(Vijay), డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ కాంబో బీస్ట్‌ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో పూజా హెగ్డే(Pooja Hegde) హీరోయిన్‌గా నటించింది. అనిరుధ్‌ రవిచంద్రన్‌ సంగీతం అందించగా, కళానిధి మారన్‌ నిర్మించారు.

Beast OTT Release: ఓటీటీ బాట పట్టిన 'బీస్ట్‌'.. స్ట్రీమింగ్ ఎప్పుడో తెలుసా?
Beast Movie Review
Venkata Chari
|

Updated on: Apr 16, 2022 | 10:31 AM

Share

Beast OTT Date: తమిళ స్టార్‌ హీరో విజయ్‌(Vijay), డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ కాంబో బీస్ట్‌ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో పూజా హెగ్డే(Pooja Hegde) హీరోయిన్‌గా నటించింది. అనిరుధ్‌ రవిచంద్రన్‌ సంగీతం అందించగా, కళానిధి మారన్‌ నిర్మించారు. ఈనెల 13న బీస్ట్(Beast) థియేటర్లో రిలీజైంది. కాగా, విజయ్‌ ఫ్యాన్స్ బేస్ మామూలుగా ఉండదు. థియేటర్లో సినిమా రిలీజైతే వారి ఆనందాలకు అవధులే ఉండవు. విజయ్ నుంచి సినిమాలకు సంబంధించి ఎలాంటి న్యూస్ వచ్చినా సోషల్ మీడియాలో ఆ హంగామానే వేరు. తాజాగా విడుదలైన ‘బీస్ట్’ విషయంలోనూ ఫ్యాన్స్ సందడి అంతా ఇంతా కాదు. అయితే, ఈ సినిమా రిలీజైన వెంటనే బాలేదన్న టాక్ బయటికి వచ్చింది. దీంతో కలెక్షన్స్‌పైనా ఈ టాక్ భారీగానే పడింది. ఓవైపు కేజీఎఫ్ 2 దంచికొడుతుంటే, బీస్ట్ మాత్రం ఏదో అలా సాగిపోతోంది. ఇందంతా పక్కన పెడితే, ప్రస్తుతం బీస్ట్ సినిమా గురించి ఓ న్యూస్ నెట్టింట్లో తెగ సందడి చేస్తోంది. థియేటర్లో అంతగా ఆకట్టుకోని ఈ సినిమా, ఓటీటీ బాట పట్టనుందంట. ఏసినిమా అయినా థియేటర్లలో రిలీజైన 30 రోజుల తర్వాత ఓటీటీల్లోకి వచ్చేస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా బీస్ట్ సినిమా ఓటీటీ న్యూస్ అందింది. మే నెలలో బీస్ట్ మూవీ ఓటీటీలో సందడి చేయనుంది. సన్‌ నెక్స్ట్‌ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో బీస్ట్ మూవీ మే నెల రెండో వారంలో స్ట్రీమింగ్ కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తమిళ, కన్నడ, తెలుగు, మలయాళ వెర్షన్లు అన్ని ఒకేసారి సన్ నెక్ట్‌లో ప్రసారం కానున్నాయి. కాగా, హిందీ వెర్షన్‌ మాత్రం నెట్‌ఫ్లిక్స్‌‌లో స్ట్రీమింగ్ కానుంది. వచ్చే నెల 13న అన్ని భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది.

Also Read: Nivetha Pethuraj:హాట్ లుక్స్ తో మైకంలో ముంచెత్తుతున్న నివేత లేటెస్ట్ ఫోటోస్ వైరల్

Divya Bharathi: కొంటె చూపులతో కుర్రకారు గుండెల్లో బాణాలు గుచ్చుతున్న దివ్య భారతి