KGF Chapter 2: కేజీఎఫ్ 2 ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ప్రస్తుతం ‘కేజీయఫ్ 2(KGF 2)’ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఎక్కడ చూసిన ఈ సినిమా రికార్డులపైనే చర్చ నడుస్తోంది. పెద్దగా ప్రమోషన్స్ లేకపోయినా.. కేజీఎఫ్ టాక్‌తోనే ధియేటర్లోకి వచ్చిన రెండో పార్ట్.. ఇండియన్ బాక్సపీస్ దగ్గర గ్రాండ్ కలెక్షన్ రికార్డ్స్‌ను..
ప్రస్తుతం ‘కేజీయఫ్ 2(KGF 2)’ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఎక్కడ చూసిన ఈ సినిమా రికార్డులపైనే చర్చ నడుస్తోంది. పెద్దగా ప్రమోషన్స్ లేకపోయినా.. కేజీఎఫ్ టాక్‌తోనే ధియేటర్లోకి వచ్చిన రెండో పార్ట్.. ఇండియన్ బాక్సపీస్ దగ్గర గ్రాండ్ కలెక్షన్ రికార్డ్స్‌ను నమోదు చేస్తోంది. తొలిరోజే రూ.100 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చి, టాలీవుడ్(Tollywood), బాలీవుడ్ అనే కాదు.. దేశవ్యాప్తంగా ‘కేజీయఫ్ 2’ ఎన్నో రికార్డులను కొల్లగొడుతోంది. యష్(Yash), సంజయ్ దత్, శ్రీనిధి శెట్టి, రవీనా టాండన్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని ప్రశాంత్ నీల్ డైరెక్షన్ చేశాడు. ఇప్పటికే రికార్డులతో థియేటర్ల తాట తీస్తోన్న ఈ సినిమాపై ఓ వార్త నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. యష్ అభిమానులకైతే ఈ న్యూస్ పండుగనే తెస్తుందనే చెప్పాలి. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసినట్లు తెలుస్తోంది. మే 13 న అంటే థియేటర్లలో విడుదలైన 4 వారాల్లోనే ఓటీటీలోకి రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన అమెజాన్ ప్రైమ్‌లో కేజీఎఫ్ 2 స్ట్రీమింగ్ అయ్యేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. కాగా, ఈ వార్తలపై మూవీ యూనిట్ మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.
శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను హోంబెల్ ఫిలింస్‌పై విజయ్ కిరగందూర్ నిర్మించారు. KGF 2 సినిమా బాక్సాఫీస్ వద్ద తొలిరోజులాగే, రెండో రోజు కూడా సత్తా చాటింది. ప్రపంచ వ్యాప్తంగా రెండో రోజు 100-115 కోట్ల రూపాయల కలెక్షన్లను రాబట్టినట్లు తెలుస్తోంది. కేజీఎఫ్ 2 హిందీ వర్షన్ రెండో రోజు దాదాపు రూ.46 కోట్లు వసూళ్లు చేసినట్లు అంచనా వేస్తున్నారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో KGF 2 సినిమా మొదటి రోజు రూ.19.5 కోట్ల షేర్ రాబట్టగా, రెండో రోజు ఏకంగా రూ.27 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు తెలుస్తోంది.
Also Read: KGF 2 Day 2 Collections: రాకీభాయ్ దూకుడు మాములుగా లేదుగా.. రెండో రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే?
Delhi Files – Vivek Agnihotri: ఇక ‘ఢిల్లీ ఫైల్స్’.. సంచలన ప్రకటన చేసిన వివేక్ అగ్నిహోత్రి..