Delhi Files – Vivek Agnihotri: ఇక ‘ఢిల్లీ ఫైల్స్’.. సంచలన ప్రకటన చేసిన వివేక్ అగ్నిహోత్రి..

Delhi Files - Vivek Agnihotri: కశ్మీర్‌ ఫైల్స్‌ సినిమా సూపర్‌ హిట్టయ్యింది. ఇక ఢిల్లీ ఫైల్స్‌ సినిమా తీస్తానని ప్రకటించారు దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి.

Delhi Files - Vivek Agnihotri: ఇక ‘ఢిల్లీ ఫైల్స్’.. సంచలన ప్రకటన చేసిన వివేక్ అగ్నిహోత్రి..
Vivek Agnihotri
Follow us
Shiva Prajapati

|

Updated on: Apr 16, 2022 | 6:45 AM

Delhi Files – Vivek Agnihotri: కశ్మీర్‌ ఫైల్స్‌ సినిమా సూపర్‌ హిట్టయ్యింది. ఇక ఢిల్లీ ఫైల్స్‌ సినిమా తీస్తానని ప్రకటించారు దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి. అవును, కశ్మీర్ ఫైల్స్ సినిమాతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన డైరెక్టర్‌ వివేక్‌ అగ్నిహోత్రి మరో సంచలన ప్రాజెక్ట్‌ ప్రకటించారు. అతిత్వరలో ఢిల్లీ ఫైల్స్‌ సినిమా తీస్తానని ప్రకటించారు. నాలుగేళ్ల పాటు ఎంతో కష్టపడి రూపొందించిన కశ్మీర్‌ ఫైల్స్‌ సినిమాకు మంచి ఆదరణ లభించిందని, తరువాతి ప్రాజెక్ట్‌కు రెడీ అయినట్టు వెల్లడించారు. క‌శ్మీర్‌లో పండిట్లపై జరిగిన దాడులపై సంచ‌ల‌న చిత్రాన్ని తెర‌కెక్కించి ద‌ర్శకుడు వివేక్ రంజ‌న్ అగ్నిహోత్రి అందరి అభిమానాన్ని చూరగొన్నారు. ఈ నేపథ్యంలోనే ‘ఢిల్లీ ఫైల్స్‌’ సినిమాలో వివేక్‌ ఏం చూపిస్తారన్న విషయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్య తరువాత సిక్కుల ఊచకోతపై ఆయన ఈ సినిమా తీస్తునట్టు ప్రచారం జరుగుతోంది.

అయితే అప్పుడే అ సినిమాపై రాజకీయ చర్చ ప్రారంభమయ్యింది. ఢిల్లీ ఫైల్స్‌ సినిమాను స్వాగతిస్తామన్నారు ఆప్‌ నేతలు. సినిమాలో వాస్తవాలు చూపిస్తే బాగుంటుందని కాంగ్రెస్‌ నేతలు సలహా ఇచ్చారు. ఢిల్లీ ఫైల్స్‌ సినిమాను ది కశ్మిర్ ఫైల్స్ నిర్మించిన అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఐ యామ్ బుద్ధ సంస్థలే నిర్మిస్తున్నాయి. హిందీతో పాటు పంజాబీలోనూ రూపుదిద్దుకోబోతున్న ఈ సినిమా ఇదే యేడాది అక్టోబర్ లో జనం ముందుకు రానుంది. . క‌శ్మీరీ హిందువుల‌కు జ‌రిగిన అన్యాయాన్ని చూపించాం. ఇక మ‌రో సినిమాపై ప‌ని చేయాల్సి వుంది. అదే ఢిల్లీ ఫైల్స్ అంటూ వివేక్ అగ్నిహోత్రి పేర్కొన్నారు. సిక్కుల పై జరిగిన ఊచకోతను కళ్లకు కట్టినట్టుగా వివేక్‌ చూపిస్తారని ఆయన అభిమానులంటున్నారు.

Also read:

IPl 2022: వరుసగా మూడో విజయాన్ని సొంతం చేసుకున్న హైదరాబాద్.. ఏడు వికెట్ల తేడాతో కోల్‌కత్తాపై గెలుపు..

Pakistan: కొత్త ప్రభుత్వం కొలువు దీరినా పాక్‌లో చల్లారని మంటలు.. సైన్యానికి, ప్రధానికి వ్యతిరేకంగా ఇమ్రాన్‌ మద్దతుదారుల ఆందోళనలు..

Viral Video: చ‌నిపోయాడ‌ని పూడ్చిపెట్టారు.. కానీ 24 గంట‌ల్లోనే ఇంటికి తిరిగొచ్చాడు.. చూసి ఫ్యూజులు ఔట్..