AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan: కొత్త ప్రభుత్వం కొలువు దీరినా పాక్‌లో చల్లారని మంటలు.. సైన్యానికి, ప్రధానికి వ్యతిరేకంగా ఇమ్రాన్‌ మద్దతుదారుల ఆందోళనలు..

Pakistan Politics: పాకిస్తాన్‌లో కొత్త ప్రభుత్వం కొలువు దీరినా ఉద్రిక్తతలు మాత్రం తగ్గడం లేదు. ఇమ్రాన్ ఖాన్ స్థానంలో ప్రధాని పీఠమెక్కిన షెబాజ్ షరీఫ్ కు వ్యతిరేకంగా ఇమ్రాన్ మద్దతుదారులు..

Pakistan: కొత్త ప్రభుత్వం కొలువు దీరినా పాక్‌లో చల్లారని మంటలు.. సైన్యానికి, ప్రధానికి వ్యతిరేకంగా ఇమ్రాన్‌ మద్దతుదారుల ఆందోళనలు..
Pakistan Politics
Basha Shek
|

Updated on: Apr 15, 2022 | 10:27 PM

Share

Pakistan Politics: పాకిస్తాన్‌లో కొత్త ప్రభుత్వం కొలువు దీరినా ఉద్రిక్తతలు మాత్రం తగ్గడం లేదు. ఇమ్రాన్ ఖాన్ స్థానంలో ప్రధాని పీఠమెక్కిన షెబాజ్ షరీఫ్ కు వ్యతిరేకంగా ఇమ్రాన్ మద్దతుదారులు, తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) నాయకులు నిరసనలకు దిగుతున్నారు. ‘చౌకీదార్ చోర్ హై’ అంటూ నినాదాలు చేస్తూ వివిధ నగరాల్లో ఆందోళనలకు పాల్పడుతున్నారు. మరోవైపు వారిని అణచివేసేందుకు కౌంటర్ గా సైన్యంతో పాటు షరీఫ్ మద్దతుగారులు రంగంలోకి దిగుతున్నారు. ఇలా పోటాపోటీ నిరసనలు, ఆందోళనలతో దాయాది దేశంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా ఏప్రిల్‌ 10వ తేదీన ఇమ్రాన్‌ ఖాన్‌ను ప్రధాని పదవి నుంచి వైదొలగిన సంగతి తెలిసిందే. తద్వారా పాక్‌ చరిత్రలో ఓటింగ్‌ ద్వారా ప్రధాని పదవి నుంచి వైదొలగిన తొలి వ్యక్తిగా ఇమ్రాన్‌ నిలిచారు. ఇక మరుసటి రోజే (ఏప్రిల్‌11) పాక్‌ 23వ ప్రధానమంత్రిగా షెహబాజ్ షరీఫ్ ప్రమాణ స్వీకారం చేశారు. కాగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి ఇమ్రాన్‌ను గద్దె దించడంలో చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ (COAS) జనరల్ కమర్ జావేద్ బజ్వా కీలక పాత్ర పోషించారు. ఈనేపథ్యంలో ఇమ్రాన్ నేతృత్వంలోని పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ మద్దతుదారులు పాకిస్తాన్ ప్రభుత్వం, సైన్యానికి వ్యతిరేకంగా పెషావర్, లాహోర్ లలో ఆందోళనలు, నిరసనల ర్యాలీలు నిర్వహిస్తున్నారు.

సైన్యం బాధ్యతలేంటో తెలుసు!

కాగా ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులపై చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ (COAS) జనరల్ కమర్ జావేద్ బజ్వా అధ్యక్షతన ఆర్మీ కమాండర్ల సమావేశం జరిగింది. ఆర్మీప్రతినిధులతో పాటు, GHQ కార్ప్స్ కమాండర్లు, ప్రిన్సిపల్ స్టాఫ్ ఆఫీసర్లు , పాక్‌ ఆర్మీ అన్ని ఫార్మేషన్ కమాండర్లు ఈ సమావేశానికి హాజరయ్యారని పాక్‌ ఆర్మీ మిలిటరీ మీడియా విభాగం ఇంటర్‌-సర్వీసెస్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ (ISPR) తెలిపింది. ‘పాకిస్తాన్ సైన్యానికి ఉన్న బాధ్యతలేంటో బాగా తెలుసు. అంతర్గత, బాహ్య బెదిరింపులకు వ్యతిరేకంగా పాకిస్తాన్ ప్రాదేశిక సమగ్రతను, సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటాం’ అని ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వా స్పష్టం చేశారు. కాగా పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, కొత్త ప్రధాని షెహబాజ్ షరీఫ్ మద్దతుదారుల మధ్య జరిగిన ముష్టియుద్ధానికి సంబంధించిన వీడియోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇద్దరు కోపంగా ఉన్న వ్యక్తులు టేబుల్‌పై ఉంచిన ఆహారం, పానీయాలను విసురుకుంటూ పరస్పరం దుర్భాషలాడుకోవడం ఈ వీడియోలో కనిపించింది.

ఇమ్రాన్ ఆరోపణలు అవాస్తవం..

మరోవైపుపాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ అక్కడి సైన్యాన్ని, ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని తీవ్ర విమర్శలు చేస్తున్నారు. సైన్యం కుట్రపూరితంగా వ్యవహరించిందని, అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి తనను పదవి నుంచి తప్పించడంలో విదేశీ కుట్ర ఉందని ఇమ్రాన్‌ ఆరోపించారు. తనపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం విఫలమైతే పాకిస్తాన్‌ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అమెరికాలో ఇస్లామాబాద్ రాయబారి లేఖ రాశారని ఇమ్రాన్‌ ఆరోపించారు. మరోవైపు ఇమ్రాన్‌ వ్యాఖ్యలపై సైన్యం, ప్రధాని షెహబాజ్ షరీఫ్ మండిపడ్డారు. ఇమ్రాన్‌ చేసిన ఆరోపణల్లో ఏ మాత్రం వాస్తవం లేదన్నారు.

పాక్‌ నేతల నోట రాహుల్‌ మాట..

కాగా ఇమ్రాన్‌ ఖాన్‌ కేబినెట్​లో మంత్రిగా పనిచేసిన షేక్ రషీద్ సైన్యానికి వ్యతిరేకంగా తాజాగా ఓ బహిరంగ సభ నిర్వహించారు. ఇందులో పాక్‌ కొత్త ప్రధానిని విమర్శిస్తూ ‘చౌకీదార్ చోర్ హై(కాపలాదారు ఒక దొంగ)’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు వినిపించాయి. షేక్ రషీద్ అహ్మద్ ప్రసంగిస్తుండగా అక్కడున్న పీటీఐ మద్దతుదారులు ఈ కామెంట్లు చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. కాగా చౌకీదార్ చోర్ నినాదాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తరచుగా ఉపయోగించేవారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని విమర్శించేందుకు ఈ నినాదాన్ని బాగా వినియోగించారు. 2019 ఎన్నికల సందర్భంగా కూడా మోడీని విమర్శిస్తూ ఇదే నినాదం చేశారు రాహుల్. ఈ విషయంలో ఆయన కోర్టు ధిక్కార ఆరోపణలు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది.

Also Read: Viral Video: చ‌నిపోయాడ‌ని పూడ్చిపెట్టారు.. కానీ 24 గంట‌ల్లోనే ఇంటికి తిరిగొచ్చాడు.. చూసి ఫ్యూజులు ఔట్..

Tirumala: అంచనాలు తప్పడంతోనే తోపులాట.. దేవున్నీ రాజకీయాల్లోకి లాగుతున్నారన్న టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి

Heart touching: తొలిసారి తల్లి స్వరం విన్న చిన్నారి.. హృదయాలను కదిలిస్తున్న వీడియో..

ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!