Alia Ranbir Wedding: రణబీర్-అలియా అన్‌సీన్ ఫోటోలు.. సోషల్ మీడియాలో వైరల్..
సుదీర్ఘ నిరీక్షణ తర్వాత, రణబీర్ కపూర్-ఆలియా భట్ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వారి పెళ్లి ఫొటోలతోపాటు మరికొన్ని అన్ సీన్ ఫొటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.
సుదీర్ఘ నిరీక్షణ తర్వాత, రణబీర్ కపూర్-ఆలియా భట్(Alia Ranbir Wedding) వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వారి పెళ్లి ఫొటోలతోపాటు మరికొన్ని అన్ సీన్ ఫొటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. కాగా, ఈ వేడుకలకు సంబంధించిన కొన్ని ఫొటోలను అలియా కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో మెహందీ ఫంక్షన్ ఫొటోలు కూడా ఉన్నాయి. ఇందులో ఒకరినొకరు కౌగిలించుకున్న ఫొటోలు కూడా ఉన్నాయి. అలాగే పెళ్లికి ముందు జరిగిన ఫంక్షన్‌కు సంబంధించి, బంధువులు, స్నేహితల ఫొటోలు కూడా ఉన్నాయి. ఈ మేరకు “ఇది ప్రేమ వికసించే సమయం. కుటుంబంతోపాటు మా అందమైన స్నేహితులు కూడా ఇందులో భాగమయ్యారు. అయాన్ DJ ప్లే చేయడం, మిస్టర్ కపూర్ (నా అభిమాన కళాకారుడు నాకు ఇష్టమైన పాటలు పాడారు) నిర్వహించిన షో, ఇలా ప్రతీది ఎంతో ఆశ్చర్యకరంగా అనిపించింది. నా జీవితంలో ప్రేమతో నిండిన కొన్ని సంతోషకరమైన క్షణాలు ఇవి. ఆ తర్వాత కూడా ఇలాంటి రోజులు ఉంటాయంటూ” రాసుకొచ్చింది.
View this post on Instagram
రణ్‌బీర్‌కి అత్తగారి నుంచి విలువైన బహుమతి
హిందుస్థాన్ టైమ్స్ తన నివేదికలో, మూలాలను ఉటంకిస్తూ జంట అందుకున్న బహుమతుల గురించి సమాచారాన్ని ఇచ్చింది. రణబీర్ కపూర్ బ్యాండ్‌ని పొందగా, ఆలియా భట్‌కి డైమండ్ రింగ్ లభించింది. అలియా తల్లి సోనీ రజ్దాన్ తన అల్లుడు రణబీర్ కపూర్‌కి ఖరీదైన వాచ్‌ని బహుమతిగా ఇచ్చింది. రణబీర్ తన అత్తగారి నుంచి బహుమతిగా అందుకున్న వాచ్ విలువ సుమారు రూ. 2.50 కోట్లు అని తెలుస్తుంది.
ఈ ప్రేమపక్షులు ఏప్రిల్ 14న సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. అలియా, రణబీర్ ఇద్దరూ తెలుపు, బంగారు రంగు దుస్తులు ధరించి, కెమెరాకు పోజులిచ్చేటప్పుడు చాలా ప్రేమగా కనిపించారు. ఇద్దరూ ఒకరినొకరు పెళ్లి చేసుకునే ముందు ఐదేళ్ల పాటు డేటింగ్‌లో ఉన్నారు. వీరిద్దరూ ప్రస్తుతం అయాన్ ముఖర్జీ బ్రహ్మాస్త్రలో మొదటిసారి కలిసి తెరపై కనిపించనున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 9, 2022న విడుదల కానుంది.
View this post on Instagram
Also Read: Prabhas: ఆ హీరోలతో పోటీపై ప్రభాస్ ఆసక్తికర వ్యాఖ్యలు.. అసలు ఏమన్నాడంటే.!
Beast OTT Release: ఓటీటీ బాట పట్టిన ‘బీస్ట్’.. స్ట్రీమింగ్ ఎప్పుడో తెలుసా?