AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RRR Movie: అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘కొమ్మ ఉయ్యాల్లో’ పాట వచ్చేసిందోచ్

పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ క్రియేట్ చేసిన రికార్డ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన విషయం తెలిసిందే..

RRR Movie: అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'కొమ్మ ఉయ్యాల్లో' పాట వచ్చేసిందోచ్
Rrr
Rajeev Rayala
|

Updated on: Apr 16, 2022 | 8:58 PM

Share

పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్(RRR) క్రియేట్ చేసిన రికార్డ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన విషయం తెలిసిందే.. తారక్ కొమురం భీం గా చరణ్ అల్లూరిసీతారామరాజుగా నటించిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇప్పటికీ ఈ సినిమా భారీ వసూళ్ల దిశగా పరుగులు పెడుతోంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో గత రికార్డులన్నింటిని తిరగరాస్తూ ట్రిపుల్ ఆర్ ప్రభంజనం సృష్టిస్తోంది. తారక్, చరణ్ అద్భుతమైన నటన.. రాజమౌళి విజువల్స్ ప్రేక్షకులను కట్టిపడేశాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. నార్త్‏లో కూడా ఆర్ఆర్ఆర్ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. రిరాక్డ్స్ స్థాయిలో వసుళ్లూ రాబడుతూ దూసుకుపోతుంది. ప్రపంచ వ్యాప్తంగా రూ. వెయ్యి కోట్లకు పైగా రాబట్టింది ఈ సినిమా. ట్రిపుల్ ఆర్ జోరు ఇప్పుడప్పుడే ఆగేలా కనిపించడం లేదు.. బాహుబలి రికార్డును బీట్ చేసే ఎయిమ్‌తో రంగంలోకి దిగిన ట్రిపుల్ ఆర్ … తాజాగా ఆ ఎయిమ్‌ను సగం రీచ్‌ అయిపోయి.. అతి తొందర్లో ఫినిష్ చేసే దిశగా పరుగెడుతోంది.

ఇటీవలే ఈ సినిమానుంచి నాటు నాటు సాంగ్ ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ పాట సోషల్ మీడియాలో విపరీతమైన రెస్పాన్స్ సొంతం చేసుకుంది. తాజాగా ఈ మూవీ నుంచి కొమ్మ ఉయ్యాలో సాంగ్ ను రిలీజ్ చేశారు.ఈ పాటను చిన్నారి ప్రకృతి రెడ్డి ఆలపించింది. ఎంఎం కీరవాణి స్వరాలు సమకూర్చగా.. గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ సాహిత్యం అందించారు. సినిమాలో బ్రిటీష్ దొరసాని చేతికి డిజైన్ చేస్తూ మల్లి అనే పాత్ర ఈ పాటను ఆలపిస్తుంది. ఈ పాటతోనే సినిమా మొదలవుతుంది. తాజాగా ఐదు భాషల్లో ఫుల్ వీడియో సాంగ్ ను వదిలారు చిత్రయూనిట్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Happy Birthday JD Chakravarthy: పలు భాషల్లో విలక్షణ నటుడి హవా.. వరుస సినిమాలతో జేడీ చక్రవర్తి ఫుల్ బిజీ..

Avantika Mishra: గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న ‘వైశాఖం’ బ్యూటీ.. వైరల్ అవుతున్న ఫోటోలు

Jayamma Panchayathi: జయమ్మ పంచాయతీ ట్రైలర్ వచ్చేసింది.. అదరగొట్టిన సుమక్క..

Follow Us
IND vs ENG: ఇంగ్లాండ్ టీ20 సిరీస్‌కు ముందు గంభీర్ సంచలన నిర్ణయం..
IND vs ENG: ఇంగ్లాండ్ టీ20 సిరీస్‌కు ముందు గంభీర్ సంచలన నిర్ణయం..
ఎందుకిలా చేశావమ్మ.. ఇద్దరు చిన్నారుల గొంతు కోసి.. ఏపీలో దారుణం
ఎందుకిలా చేశావమ్మ.. ఇద్దరు చిన్నారుల గొంతు కోసి.. ఏపీలో దారుణం
‘ఉపాధి హామీ’ రద్దు.. నేటి నుంచి కొత్త చట్టం!
‘ఉపాధి హామీ’ రద్దు.. నేటి నుంచి కొత్త చట్టం!
ఇకపై ప్రతీ నెల సన్న బియ్యం పంపిణీ.. రేవంత్ సర్కార్ కీలక ఆదేశాలు..
ఇకపై ప్రతీ నెల సన్న బియ్యం పంపిణీ.. రేవంత్ సర్కార్ కీలక ఆదేశాలు..
జల దిగ్బంధనంతో నిస్సహాయ స్థితిలో పాకిస్థాన్!
జల దిగ్బంధనంతో నిస్సహాయ స్థితిలో పాకిస్థాన్!
PPF ఖాతాను బ్యాంకుకు లేదా పోస్ట్ ఆఫీస్‌కు బదిలీ చేయవచ్చా?
PPF ఖాతాను బ్యాంకుకు లేదా పోస్ట్ ఆఫీస్‌కు బదిలీ చేయవచ్చా?
చేతబడి చేస్తున్నాడనే అనుమానం.. చివరకు ఎంత దారుణం జరిగిందో తెలుసా?
చేతబడి చేస్తున్నాడనే అనుమానం.. చివరకు ఎంత దారుణం జరిగిందో తెలుసా?
టాలీవుడ్‌లో దుమ్మురేపుతున్న ముద్దుగుమ్మ..
టాలీవుడ్‌లో దుమ్మురేపుతున్న ముద్దుగుమ్మ..
ఖారా మిక్చర్‌లో వేయించిన బల్లి... అది తిన్నవారి పరిస్థితి మరీ?
ఖారా మిక్చర్‌లో వేయించిన బల్లి... అది తిన్నవారి పరిస్థితి మరీ?
బట్టతలతో కనిపించిన కాకి...అపశకునమా? లేక ప్రకృతిలో జరిగే సహజ వింత?
బట్టతలతో కనిపించిన కాకి...అపశకునమా? లేక ప్రకృతిలో జరిగే సహజ వింత?