Prabhas: ఆ కారు ప్రభాస్‌ది కాదట.. క్లారిటీ ఇచ్చిన రెబల్ స్టార్ పీఆర్ టీమ్.. అసలేమైందంటే..?
Prabhas Car Fined: హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.. నియమాలు, నిబంధనలు అతిక్రమిస్తున్న వాహనదారులపై కొరడా ఝుళిపిస్తున్నారు. గత కొన్ని రోజులకు వాహనాలకు ఉన్న బ్లాక్ స్టిక్కర్లు, బ్లాక్ ఫిల్మ్‌లను పోలీసులు తొలగిస్తున్న విషయం తెలిసిందే.
Prabhas Car Fined: హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.. నియమాలు, నిబంధనలు అతిక్రమిస్తున్న వాహనదారులపై కొరడా ఝుళిపిస్తున్నారు. గత కొన్ని రోజులకు వాహనాలకు ఉన్న బ్లాక్ స్టిక్కర్లు, బ్లాక్ ఫిల్మ్‌లను పోలీసులు తొలగిస్తున్న విషయం తెలిసిందే. దీంతోపాటు అలాంటి వాహనాలపై ఫైన్లు కూడా వేస్తున్నారు. సెలబ్రిటీలు, సామాన్యులు అనే తేడా లేకుండా అందరికీ ఈ జరిమానాలు విధిస్తున్నారు. ఇందులో భాగంగా టాలీవుడ్‌కు చెందిన ఎన్టీఆర్, అల్లు అర్జున్, మంచు మనోజ్, కల్యాణ్ రామ్, త్రివిక్రమ్ శ్రీనివాస్, అక్కినేని నాగ చైతన్య తదితరుల వాహనాలకు ట్రాఫిక్ పోలీసులు (hyderabad traffic police) చలానాలు వేయడంతోపాటు అక్కడికక్కడే వారి కార్లకున్న బ్లాక్ ఫిలింలను తొలగించిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) కు సంబంధించిన కారుకు ఫైన్ విధించినట్లు వార్తలొచ్చాయి. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే అది ప్రభాస్ కారు కాదంటూ తేలింది.
శనివారం.. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ -36లో నీరూస్ కూడలి వద్ద ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో ఎంపీ స్టిక్కర్, బ్లాక్ ఫ్రేమ్‌తో వెళుతోన్న ఓ కారు వారి కంటపడింది. దీంతో బెంజీ కారును పోలీసులు ఆపి పత్రాలు చూపాలని డ్రైవర్‌ను కోరారు. పత్రాలు లేవని, కారు సినీ నటుడు ప్రభాస్‌కు చెందిందని డ్రైవర్ చెప్పాడు. దీంతో కారుకు రూ.1600 జరిమానా విధించారు. అయితే.. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రభాస్ వ్యక్తిగత సహాయకుడు రామకృష్ణ సీఐ ముత్తును కలిసి వివరణ ఇచ్చారు. కారు ప్రభాస్ బంధువు నరసింహరాజుకు సంబంధించినదని వివరించారు. ఈ మేరకు సంబంధిత పత్రాలను చూపించినట్లు ప్రభాస్ పీఆర్ టీమ్ వెల్లడించింది.
Also Read: