AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కిచిడిలో ఉప్పు ఎక్కువైందని ఘాతుకం.. భార్యపై భర్త ఏం చేశాడో తెలుసా..?

Man kills wife: దేశంలో నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. క్షణికావేశంలో కొందరు దారుణానికి ఒడిగడుతున్నారు. రక్త సంబంధాలను, బంధుత్వాలను మరిచి మృగాల్లా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఓ వ్యక్తి టిఫిన్‌లో ఉప్పు ఎక్కువైందన్న కారణంతో

కిచిడిలో ఉప్పు ఎక్కువైందని ఘాతుకం.. భార్యపై భర్త ఏం చేశాడో తెలుసా..?
Khichadi
Shaik Madar Saheb
|

Updated on: Apr 17, 2022 | 7:52 AM

Share

Man kills wife: దేశంలో నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. క్షణికావేశంలో కొందరు దారుణానికి ఒడిగడుతున్నారు. రక్త సంబంధాలను, బంధుత్వాలను మరిచి మృగాల్లా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఓ వ్యక్తి టిఫిన్‌లో ఉప్పు ఎక్కువైందన్న కారణంతో కట్టుకున్న భార్యనే దారుణంగా కడతేర్చాడు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని థానేలో చోటు చేసుకుంది. భయాందర్ టౌన్‌‌షిప్‌లో నివాసముంటున్న ఓ వ్యక్తి భార్యను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. భయందర్-వసాయ్ విరార్ కమిషనరేట్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భయాందర్ టౌన్‌షిప్‌లో నివాసముంటున్న నీలేష్ ఘాగ్ (46) కిచిడీలో ఉప్పు ఎక్కువైందంటూ భార్య నిర్మలపై ఆగ్రహం వ్యక్తంచేశాడు. అనంతరం కోపంతో ఆమెపై దాడి చేశారు. ఈ క్రమంలో పొడవాటి గుడ్డతో ఆమె గొంతు బిగించి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.

శుక్రవారం ఉదయం 9గంటల సమయంలో భయాందర్ ఈస్ట్‌లోని ఫటక్ రోడ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకోని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు ఘాగ్ పై నవ్‌ఘర్ పోలీస్ స్టేషన్‌లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశామని తెలిపారు.

కాగా.. గురువారం టీతో పాటు అల్పాహారం ఇవ్వలేదని.. అత్త కోడలిని తుపాకీతో కాల్చిన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో రాబోడి ప్రాంతానికి చెందిన 42 ఏళ్ల మహిళ కడుపులో బుల్లెట్ గాయాలతో శుక్రవారం ఉదయం ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిందని పోలీసులు తెలిపారు. ఇది మరవక ముందే.. ఇలాంటి మరో ఘటన చోటుచేసుకోవడంపై పలువురు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

Also Read:

TSRTC: షార్ట్ ఫిల్మ్ చేయండి.. రూ.10వేలు గెలుచుకోండి.. ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్

Weekly Horoscope: వార ఫలాలు.. ఏప్రిల్‌ 17 నుంచి 23 వరకు ఈ రాశుల వారికి అనుకూలం..