TSRTC: షార్ట్ ఫిల్మ్ చేయండి.. రూ.10వేలు గెలుచుకోండి.. ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్

Ganesh Mudavath

Ganesh Mudavath |

Updated on: Apr 17, 2022 | 7:22 AM

నిత్యం సరికొత్త ఆఫర్లతో ప్రజాభిమానాన్ని చూరగొంటున్న తెలంగాణ ఆర్టీసీ(TSRTC) మరో అడుగు ముందుకేసింది. షార్ట్‌ ఫిల్మ్‌లు (Short Film) రూపొందించేందుకు ఎంట్రీలను ఆహ్వానిస్తూ ఆర్టీసీ అధికారులు నోటిఫికేషన్‌ జారీ చేశారు. మెరుగ్గా....

TSRTC: షార్ట్ ఫిల్మ్ చేయండి.. రూ.10వేలు గెలుచుకోండి.. ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్
Tsrtc

నిత్యం సరికొత్త ఆఫర్లతో ప్రజాభిమానాన్ని చూరగొంటున్న తెలంగాణ ఆర్టీసీ(TSRTC) మరో అడుగు ముందుకేసింది. షార్ట్‌ ఫిల్మ్‌లు (Short Film) రూపొందించేందుకు ఎంట్రీలను ఆహ్వానిస్తూ ఆర్టీసీ అధికారులు నోటిఫికేషన్‌ జారీ చేశారు. మెరుగ్గా ఉన్న వాటిలోనుంచి ఎంపిక చేసిన మొదటి ఫిల్మ్‌కు రూ.10 వేలు, రెండో ఫిల్మ్‌కు రూ.5 వేలు, మూడో ఫిల్మ్‌కు రూ.రెండున్నర వేలు పురస్కారం ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ప్రజా రవాణా ప్రాముఖ్యతను ప్రతీ ఇంటికి తీసుకువెళ్లేందుకు ఈ ఫిల్మ్ లు ఉపయోగపడే విధంగా ఉండాలని సూచించారు. సురక్షితమైన ఆర్టీసీ ప్రయాణం, లీటర్ పెట్రోల్ ధర కన్నా తక్కువగా రూ.100కే రోజంతా హైదరాబాద్(Hyderabad) సిటీ బస్సుల్లో ప్రయాణం, పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు బుక్ చేసుకుంటే ఇంటికే ఆర్టీసీ బస్, కార్గో సేవలు, గరుడ, రాజధాని బస్సుల్లో సౌకర్యాలు, తదితర అంశాలపై ప్రజలను ఆకట్టుకునే విధంగా ఉండే షార్ట్ ఫిలింలను తీసి పంపించాలి. ఆర్టీసీ మీకు ఆకర్షణీయమైన బహుమతులను అందజేస్తుందని అధికారులు పేర్కొన్నారు. ఆర్టీసీ షార్ట్ ఫిలిం కాంటెస్ట్‌లో పాల్గొనాలనుకుంటే మీ పూర్తి వివరాలను ఈ నెల(ఏప్రిల్) 21 లోగా tsrtcshortfilmcontest@gmail.com పంపించాలని వివరించారు.

Also Read

Corona: పిల్లల్లో కరోనా విజృంభణ.. ఆరోగ్య పరిస్థితిపై నిపుణులు ఏమన్నారంటే

Viral Video: వంతెనపై ఫుల్ స్పీడ్‌లో కారు.. ఒక్కసారిగా కిందకు దూకేశాడు.. మైండ్ బ్లాంక్ వీడియో..!

DC vs RCB Score: దంచికొట్టిన దినేశ్‌ కార్తీక్‌.. రాణించిన మ్యాక్సీ.. ఢిల్లీ టార్గెట్‌ ఎంతంటే..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu