Inter Exams: ఇంటర్ విద్యార్థులకు గమనిక.. ఇబ్బందులు తలెత్తకుండా అధికారుల కీలక నిర్ణయం

మే నెల మొదటి వారంలో జరగనున్న ఇంటర్ పరీక్షల(Inter Exams) నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. బెంచీకి ఒకరిని మాత్రమే అనుమతివ్వడం, గదికి 20 నుంచి 25 మంది విద్యార్థులు మాత్రమే కూర్చునేలా జాగ్రత్తలు....

Inter Exams: ఇంటర్ విద్యార్థులకు గమనిక.. ఇబ్బందులు తలెత్తకుండా అధికారుల కీలక నిర్ణయం
Inter Exams
Follow us

|

Updated on: Apr 17, 2022 | 8:37 AM

మే నెల మొదటి వారంలో జరగనున్న ఇంటర్ పరీక్షల(Inter Exams) నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. బెంచీకి ఒకరిని మాత్రమే అనుమతివ్వడం, గదికి 20 నుంచి 25 మంది విద్యార్థులు మాత్రమే కూర్చునేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో పరీక్షా కేంద్రాలకు(Exam Centers) వెళ్లేందుకు విద్యార్థులు ఇబ్బందులు పడకుండా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. పరీక్ష కేంద్రం ఎక్కడ ఉండో విద్యార్థి సులువుగా తెలుసునేందుకు వీలుగా జీపీఎస్‌కు(GPS) అనుసంధానం చేశారు. మే 6 నుంచి ప్రథమ సంవత్సరం, 7 నుంచి ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభంకానున్నాయి. 19వ తేదీతో పూర్తవుతాయి. ఒక రోజు ప్రథమ, మరుసటి రోజు ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరుగుతాయి. విద్యార్థులకు పరీక్షా కేంద్రం గుర్తింపులో ఇబ్బందులు తలెత్తకుండా జీపీఎస్‌కు అనుసంధానం చేశారు. విద్యార్థి పరీక్షా కేంద్రం కోడ్‌ నంబర్‌ను జీపీఎస్‌లో నమోదు చేస్తే జీపీఎస్ కేంద్రం ఉన్న ప్రాంతాన్ని గుర్తిస్తుంది. విద్యార్థి తాను ఉన్న ప్రాంతం నుంచి వెళ్లటానికి అవసరమైన రహదారిని కూడా చూపిస్తుంది. ఈ విధానాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

హైదరాబాద్‌(Hyderabad) , రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లోనే ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు హాజరు కానున్నారు. ఇందుకు తగ్గట్టుగా కేంద్రాలు ఎంపిక చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలతో పాటు శివారుల్లో ఉన్నత పాఠశాలల్లోనూ కేంద్రాలున్నాయి. కరోనా(Corona) తర్వాత పరీక్షలు జరగలేదు. రెండేళ్ల తర్వాత నిర్వహిస్తుండడంతో కేంద్రాలను జాగ్రత్తగా ఎంపిక చేయాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. కరోనా నిబంధనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహించేందుకు ఇలాంటి చర్యలు తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు.

Also Read

Covid-19 Cases: ఢిల్లీ పాఠశాలల్లో కరోనా విజృంభణ.. కేజ్రీవాల్ సర్కార్ కీలక నిర్ణయం..

Shani Dev: ఉద్యోగం రావడం లేదా? ఏ ప్రయత్నమూ సక్సెస్ అవడం లేదా? అయితే శనివారం రోజు ఇలా చేయండి..!

Viral Video: వంతెనపై ఫుల్ స్పీడ్‌లో కారు.. ఒక్కసారిగా కిందకు దూకేశాడు.. మైండ్ బ్లాంక్ వీడియో..!