Shani Dev: ఉద్యోగం రావడం లేదా? ఏ ప్రయత్నమూ సక్సెస్ అవడం లేదా? అయితే శనివారం రోజు ఇలా చేయండి..!

Shani Dev: శనివారం శని దేవుడికి అంకితం చేయబడింది. శని దేవుడిని న్యాయ దేవత, కర్మ దాత అని కూడా అంటారు. శని దేవుడు ఒక వ్యక్తికి సంబంధించిన మంచి,

Shani Dev: ఉద్యోగం రావడం లేదా? ఏ ప్రయత్నమూ సక్సెస్ అవడం లేదా? అయితే శనివారం రోజు ఇలా చేయండి..!
Shani Dev
Follow us
Shiva Prajapati

|

Updated on: Apr 17, 2022 | 6:33 AM

Shani Dev: శనివారం శని దేవుడికి అంకితం చేయబడింది. శని దేవుడిని న్యాయ దేవత, కర్మ దాత అని కూడా అంటారు. శని దేవుడు ఒక వ్యక్తికి సంబంధించిన మంచి, చెడు పనులను పరిశీలిస్తాడని ప్రతీతి. తదనుగుణంగా సదరు వ్యక్తికి ఫలాలను ఇస్తాడు. అయితే, శని దేవుడి చెడు దృష్టి ఒక వ్యక్తిపై పడినట్లయితే.. వారి జీవితం చిన్నాభిన్నమైపోతుంది. ఇలాంటి సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే.. శనివారం నాడు కొన్ని చర్యలు చేపడితే మంచి ఫలితం ఉంటుందిన జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. సాధారణంగా శని దేవుడి కోపానికి గురైతే చేసే ప్రతి పనిలో ఆటంకాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉద్యోగం నుంచి ప్రతీ పనిలోనూ అనేక వైఫల్యాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో సమస్యల పరిష్కారానికి జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని నివారణలు పేర్కొనడం జరిగింది. వాటి ప్రకారం శనివారం నాడు కొన్ని నివారణలు పాటిస్తే మంచి జరుగుతుంది. మరి ఆ నివారణా చర్యలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

శనివారం ఈ చర్యలు చేపట్టండి.. 1. జాతకంలో శని దుష్ప్రభావం కొనసాగుతున్నట్లయితే ఉద్యోగంలో అనేక రకాల ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. ఇలాంటి పరిస్థితిలో.. శనివారం నాడు నానబెట్టిన నల్ల శనగలను ఉప్పు లేకుండా, మసాలాలు జోడించకుండా ఆవనూనెలో ఉడికించాలి. వీటిని నల్ల ఆవు, నల్ల కుక్క, మరేదైనా జంతువుకు తినిపిస్తే ప్రభావం ఉంటుంది. ఇలా 3 శనివారాలు వరకు చేయాల్సి ఉంటుంది. 2. శనివారం నాడు చీమలకు పిండి, చేపలకు పిండి మాత్రలు పోయడం వల్ల ఉద్యోగంలో పురోగతి లభిస్తుంది. స్వీట్లు తినడం మానుకోవాలి. కొన్ని శనివారాలు ఈ పరిహారం చేస్తే ప్రయోజనం ఉంటుంది. 3. కోరుకున్న ప్రదేశంలో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారు శనివారం సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఆవనూనెతో దీపం వెలిగించండి. ఆ తరువాత శని చాలీసా, శని స్తోత్రాన్ని పఠించండి. ఇలా 3 శనివారాలు నిరంతరం చేయాలి. 4. శనివారం సాయంత్రం రావి చెట్టు కింద నాలుగు ముఖాల ఆవనూనె దీపం వెలిగించి, శని మంత్రాన్ని 108 సార్లు జపిస్తే ఉద్యోగం వస్తుంది. తర్వాత రావి చెట్టుకు ప్రదక్షిణ చేయండి. ఇలా వరుసగా 11 శనివారాలు చేయాలి. 5. శనివారం సాయంత్రం ఒక గిన్నెలో ఆవాల నూనె తీసుకోండి. ఆ తరువాత ఎడమ చేతి మధ్య వేలును అందులో ఉంచి శని మంత్రాన్ని జపించండి. ఈ నూనెతో రావి చెట్టు క్రింద దీపం వెలిగించండి. వరుసగా 3 శనివారాలు ఈ పరిహారం చేయండి.

(గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాలు, జ్యోతిష్య శాస్త్రం ఆధారంగా ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధ్రువీకరించలేదు.)

Also read:

Delhi Files – Vivek Agnihotri: ఇక ‘ఢిల్లీ ఫైల్స్’.. సంచలన ప్రకటన చేసిన వివేక్ అగ్నిహోత్రి..

Viral Video: ఈ రైతు చాలా స్మార్ట్ గురూ.. పొలం పనుల్లో సరికొత్త ప్రయోగం.. మీకూ ఉపయోగపడొచ్చు ఓ లుక్కేయండి..!

Russia – Ukraine War: పుతిన్‌కు ఆగ్రహం కలిగించిన ఆ ఘటన.. సైన్యానికి కీలక ఆదేశాలు జారీ..!

పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
మార్కెట్ లో పసిడి కాంతులు.. బంగారానికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్
మార్కెట్ లో పసిడి కాంతులు.. బంగారానికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
మీ ఇంట్లో పాత ఎల్ఐసీ బాండ్ ఉందా..? ఇలా చేస్తే సొమ్ము వాపస్
మీ ఇంట్లో పాత ఎల్ఐసీ బాండ్ ఉందా..? ఇలా చేస్తే సొమ్ము వాపస్
యువతిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ బుల్లితెర నటుడు అరెస్ట్
యువతిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ బుల్లితెర నటుడు అరెస్ట్
10 రోజుల షూటింగ్ కోసం రూ.9 కోట్లు రెమ్యునరేషన్..
10 రోజుల షూటింగ్ కోసం రూ.9 కోట్లు రెమ్యునరేషన్..
వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు
వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..