Viral Video: ఈ రైతు చాలా స్మార్ట్ గురూ.. పొలం పనుల్లో సరికొత్త ప్రయోగం.. మీకూ ఉపయోగపడొచ్చు ఓ లుక్కేయండి..!
Viral Video: ‘కళ్లు ఉన్నోడు ముందు మాత్రమే చూస్తాడు.. ధిమాక్ ఉన్నో దునియా మొత్తం చూస్తాడు’ అనే సినిమా డైలాగ్ ఈ రైతుకు పక్కాగా సరిపోలుతుంది.
Viral Video: ‘కళ్లు ఉన్నోడు ముందు మాత్రమే చూస్తాడు.. ధిమాక్ ఉన్నో దునియా మొత్తం చూస్తాడు’ అనే సినిమా డైలాగ్ ఈ రైతుకు పక్కాగా సరిపోలుతుంది. పెద్ద పెద్ద చదువులు చదివిన వారే నూతన ఆవిష్కరణలు చేస్తారు? కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలు వారి వల్లే అవుతాయనే ఆలోచనలకు చెక్ చెబుతూ.. ఓ రైతు సరికొత్త ప్రయోగాన్ని తెరమీదకు తీసుకువచ్చాడు. కష్టపడి పని చేయడం కాదు.. స్మార్ట్‌గా పని చేయాలని చెబుతుంటారు. ఈ రైతు కూడా చాలా స్మార్ట్ ఆలోచించాడు. ఆ తెలివితోనే పంట పొలాలకు నీటిని చాలా స్మార్ట్‌గా సరఫరా చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ స్మార్ట్ ప్రయోగం చూసి చదువుకున్న ఇంజనీర్ల మతిపోవడం ఖాయం.
సాధారణంగా వ్యవసాయ క్షేత్రంలో పంటకు నీళ్లు పెడితే.. ప్రవాహ ఉధృతంగా ఉంటుంది. ఆ ప్రవాహంతో నీటితో పాటు మట్టి కొట్టుకుపోయి గట్లు దెబ్బ తింటాయి. చెట్టు వేర్లు దిబ్బతినడం కూడా జరుగుతుంది. కొన్నిసార్లు విత్తనాలు వేసిన దశలో నీటిని పెట్టినప్పుడు.. ఆ నీటి ప్రవాహ ఉధృతికి విత్తనాలు కూడా కొట్టుకుపోయే అవకాశం ఉంది. దానిని దృష్టిలో ఉంచుకుని ఓ రైతు సరికొత్త ప్రయోగం చేశాడు. నీటి ప్రవాహ ఉధృతిని నియంత్రించేందుకు కొత్త ప్లాన్ వేశాడు. ఒక ప్లాస్టిక్ కవర్‌లో నీటిని నింపాడు. ఆ కవర్‌ను నీటి ప్రవాహానికి అడ్డుగా వేయగా.. ఆ ప్రవాహ ఉధృతి నెమ్మదించింది. నీరు ఆ కవర్‌ను ముందుకు నెడుతూ నెమ్మదిగా ప్రవాహించడం మొదలుపెట్టింది. దీనికి సంబంధించిన వీడియోను techzexpress అనే ఖాతా ద్వారా Instagramలో షేర్ చేశారు. ఆ వీడియోకు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. రైతు స్మార్ట్ వర్క్‌కు సలామ్ కొడుతున్నారు.
View this post on Instagram
Also read:
Migraine Relief Tips: ఈ ఐదు యోగాసనాలు మైగ్రేన్ మరియు తలనొప్పి నుండి బయటపడటానికి సహాయపడతాయి
Hair Care Tips: జుట్టు సమస్యలతో సతమతం అవుతున్నారా? ఉల్లిపాయ నూనెతో ఇలా చేయండి..
Viral Video: 71 ఏళ్ల వయసులోనూ తగ్గేదే లే అంటున్న బామ్మ.. ఏకంగా 11 రకాల వెహికిల్ లైసెన్స్‌లు పొంది..